Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI VS CSK: ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ - రుతురాజ్ గైక్వాడ్ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 18వ సీజన్ లో భాగంగా మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్ - ముంబయి ఇండియన్స్ తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. ఇప్పుడా వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అతడేమన్నాడంటే?

దాని కోసం సిద్ధంగా ఉన్న మహీ..
రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ. . "దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను చూస్తే ఆయన ఇంకా అద్భుతంగా ఆడుతున్నారు. అది కూడా 50 ఏళ్ల వయసులో. ఇంకొన్నేళ్లు ఆన ఆడతారని అది చూస్తేనే అర్థమైపోతుంది. అది కచ్చితంగా మా లాంటి క్రికెటర్సను స్ఫూర్తినిస్తుంది. ఇక ధోనీ 43 ఏళ్ల వయసులో ధోనీ కూడా అద్భుతంగా ఆడుతున్నారు. తనవంతుగా జట్టు కోసం ఏం చేయలో, అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గత రెండు సీజన్లుగా పాటిస్తున్న వ్యూహాలనే ఇప్పుడు కూడా ఫాలో అవుతాం. పెద్దగా మార్పులేమీ లేవు. ధోనీ కూడా మా కోసం తన కీలక ఇన్నింగ్స్ ను కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం.

Ruturaj Gaikwad on Dhoni ipl retirement says he will continue too many years ahead MI VS CSK

దానిపైనే దృష్టి...
గత సీజన్‌లో ధోనీ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. అప్పుడతడు భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి ఆడాడు. దాని గురించి రుతురాజ్ మాట్లాడుతూ.. '' నాకు తెలిసి మహీ పరిమితంగానే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తనకేం తెలుసో దాని సాధించడం కోసమే అతడు శిక్షణ చేస్తున్నాడు. ఐపీఎల్‌లో అతడి పాత్ర ఏదైనా గానీ, క్రీజ్‌లో ఉన్నంత సేపు వీలైనంతగా సిక్సర్లు కొట్టడమే అతడి ఫోకస్. మొదటి రోజే అతడు సక్సెస్ కాలేకపోయినా.. మాకేం సమస్య లేదు. ధోనీ ఎప్పుడూ మాకు ప్రత్యేకమే. చాలా ఏళ్లుగా జట్టు కోసం ఎంతో చేశాడు'' అని రుతురాజ్ అన్నాడు.

Story first published: Sunday, March 23, 2025, 13:08 [IST]
Other articles published on Mar 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+