Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండియా-ఏ తరుపున ఓపెనర్‌గా రేసులో: ఎవరీ రుతురాజ్ గైక్వాడ్?

Ruturaj Gaikwad: Another Team India opener knocking the selectors door in front

హైదరాబాద్: రుతురాజ్ గైక్వాడ్... ఇండియా-ఏ జట్టు తరుపున అద్భుత ప్రదర్శన చేస్తోన్న ఆటగాడు. 22 ఏళ్ల రుతురాజ్ వెస్టిండిస్-ఏ జట్టుతో జరిగిన ైదు వన్డేల అనధికార సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. అంతేకాదు ఇండియా-ఏ తరఫున ఆడిన గత ఎనిమిది వన్డేల్లో 116 స్ట్రయిక్‌రేట్‌తో 677 పరుగులు పరుగులు చేశాడు.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

ఇందులో రెండు సెంచరీలు(187*,125*) కూడా ఉన్నాయి. పుణెలో పుట్టిన రుతురాజ్ ప్రస్తుతం రంజీల్లో మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 12 ఏళ్ల వయసులో వెంగ్‌సర్కార్ క్రికెట్ అకాడమీలో చేరి కఠోర శిక్షణ తీసుకున్నాడు. 19 ఏళ్ల వయసులోనే మహారాష్ట్ర తరఫున ఫస్ట్‌క్లాస్‌లో అరంగేట్రం చేశాడు.

ఇక, లిస్ట్-ఏ కెరీర్‌లో 39 మ్యాచ్‌ల్లో 59.94 సగటుతో రెండు వేలకు పైగా పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలతో పాటు 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విజయ్‌హజారే ట్రోఫీలో మహారాష్ట్ర తరఫున ఏడు మ్యాచ్‌లాడిన రుతురాజ్ మొత్తం 444 పరుగులు చేశాడు. శ్రీలంక-ఏతో ఈ ఏడాది మొదట్లో జరిగిన అనధికార వన్డే సిరీస్‌లో 187,125 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

అనంతరం ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ "నేను ఎక్కువగా సిక్స్‌లు కొట్టాలనుకోను. గ్యాప్స్‌లోనే ఆడుతా. సింగి ల్స్, డబుల్స్‌కు ప్రాధాన్యమిస్తా. సుదీర్ఘంగా ఆడాలనుకుంటా. అసలు ప్రతీమ్యాచ్‌లో నాటౌట్‌గా నిలవాలన్నదే నా లక్ష్యం. బ్లూజెర్సీ ధరించి... సీనియర్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే తన లక్ష్యం" అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు.

Story first published: Friday, July 26, 2019, 15:26 [IST]
Other articles published on Jul 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+