Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

UAE ILT20: కేకేఆర్ ఫ్రాంచైజీ కొన్న అబుదాబి నైట్ రైడర్స్‌లో నరైన్, రస్సెల్ తదితర భీకర ప్లేయర్లు..!

Russel, Narine, Bairstow some Other T20 Stars In Abu Dhabi Knight Riders

యూఏఈ బోర్డు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోయే టీ20 టోర్నీ.. ఇంటర్నేషనల్ లీగ్ T20 (ILT20). వచ్చే ఏడాది జనవరి - ఫిబ్రవరిలో ఈ లీగ్ జరగబోతుంది. ఈ లీగ్‌లో పాల్గొనబోయే ఆరు జట్లలో ఒకటైన అబుదాబి నైట్ రైడర్స్ జట్టు.. తొలి ఎడిషన్లో పాల్గొనబోయే తమ జట్టును ప్రకటించింది. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (TKR), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున ఆడిన ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీతో తమ అనుబంధాన్ని యూఏఈ లీగ్‌లో కూడా వీరు కొనసాగించబోతున్నారు. అబుదాబి నైట్ రైడర్స్ టీంను.. ఐపీఎల్లోని కేకేఆర్ ఫ్రాంచైజీ కొనుక్కున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఇంగ్లాండ్ వికెట్ కీపర్ కం బ్యాటర్ జానీ బెయిర్‌స్టో కూడా అబుదాబి జట్టులో ఉండడం విశేషం. 2022లో జానీ బెయిర్ స్టో భీకర ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో ఐర్లాండ్‌లో అత్యధిక పరుగులు సాధించిన పాల్ స్టిర్లింగ్ కూడా అబుదాబి ఫ్రాంచైజీలో భాగమయ్యాడు.

గ్లోబల్ టోర్నీల్లో మా అడుగులు

ఇకపోతే కేకేఆర్‌కు కరేబియన్ లీగ్ ఫ్రాంచైజీ అయిన ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తరఫున ఆడే అకేల్ హోసేన్, సీక్కుగే ప్రసన్న, రవి రాంపాల్, అలీ ఖాన్ కూడా అబుదాబీ ఫ్రాంఛైజీకి ఆడేందుకు సైన్ చేశారు. శ్రీలకం లెఫ్టార్మ్ బ్యాటర్ చరిత్ అసలంక కూడా అబుదాబికి తన క్రికెట్ సేవలందించనున్నాడు. అతను టీ20 ప్రపంచ‌కప్ 2021లో శ్రీలంక ప్రధాన రన్-స్కోరర్‌లలో ఒకడు అనే సంగతి తెలిసిందే. ‘గ్లోబల్ క్రికెట్ టోర్నీల్లో మా భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు అడుగులు వేస్తుండడం చాలా సంతోషంగా గొప్పగా ఉంది. IPLలో KKR, CPLలో TKR, ఇప్పుడు ILT20లో ADKR జట్లను మేం సొంతం చేసుకున్నాం.'అని నైట్ రైడర్స్ సీఈవో వెంకీ మైసూర్ పేర్కొన్నాడు.

వాళ్లందరికీ ఘన స్వాగతం

వాళ్లందరికీ ఘన స్వాగతం

‘అబుదాబి నైట్ రైడర్స్ టీంలో మా ప్రధాన ప్లేయర్లు సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్‌లను కలిగి ఉండటం చాలా సంతోషంగా ఉంది. జానీ బెయిర్‌స్టో లాంటి ఉద్ధండ ప్లేయర్ నైట్ రైడర్స్ కుటుంబంలో చేరినందుకు కూడా ఆనందిస్తున్నాం. ILT20లో అబుదాబి నైట్ రైడర్స్ జర్నీ సజావుగా సాగుతుందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. నైట్ రైడర్స్ కుటుంబానికి పాల్ స్టిర్లింగ్, చరిత్ అసలంక, కెన్నార్ లూయిస్, లహిరు కుమార, రేమన్ రీఫర్, బ్రాండన్ గ్లోవర్‌లకు ఘన స్వాగతం తెలుపుతున్నాం. ILT20 ఒక ఉత్తేజకరమైన టోర్నమెంట్ అని మేం ఆశిస్తున్నాం. ఈ టోర్నీలో భాగంగా టీ20 మజాను ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నాం' అని వెంకీ మైసూరు చెప్పాడు.

పాకిస్తాన్‌‌తో మ్యాచ్‌ అయితే పెద్ద స్పెషల్ ఆ? *Cricket | Telugu OneIndia
అబుదాబి నైట్ రైడర్స్ స్క్వాడ్

అబుదాబి నైట్ రైడర్స్ స్క్వాడ్

సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, అకేల్ హోసేన్, రేమన్ రీఫర్, కెన్నార్ లూయిస్, రవి రాంపాల్ (వెస్టిండీస్), జానీ బెయిర్‌స్టో (ఇంగ్లాండ్), పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్), లాహిరు కుమార, చరిత్ అసలంక, సీక్కుగే ప్రసన్న (శ్రీలంక), కోలిన్ ఇంగ్రామ్ (దక్షిణాఫ్రికా), అలీ ఖాన్ (అమెరికా), బ్రాండన్ గ్లోవర్ (నెదర్లాండ్స్).

అయితే నిబంధనల ప్రకారం.. ప్రతి టీం ప్లేయింగ్ 11లో ఇద్దరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆటగాళ్లు తప్పకుండా ఉండాలి. ప్రస్తుతానికి అయితే లోకల్ ప్లేయర్లు ఇంకా ఎంపికకాలేదు. వారు డ్రాఫ్ట్‌లో ఎంపిక కానున్నారు.

Story first published: Tuesday, August 16, 2022, 19:07 [IST]
Other articles published on Aug 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+