Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐదు కాదు మూడే: లంక ప్లేయర్‌కు లక్ష్మణ్ పంచ్, నెటిజన్ల ఫిదా

 Russel Arnold predicts India won’t pull another whitewash in ODIs, gets trolled by VVS Laxman

హైదరాబాద్: భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ముగిసింది. ఈ సిరిస్‌‌ను 1-0తో కోహ్లీసేన కైవసం చేసుకుంది. నిజానికి శ్రీలంక భారత పర్యటనకు రాకముందు 3-0తో వైట్ వాష్ అవుతుందని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా 1-0తో ఓటమి పాలవడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచింది.

ఇందులో భాగంగా ఈ సిరిస్‌కు కామెంటేటర్‌గా వ్యవహారిస్తోన్న రసెల్ ఆర్నాల్డ్ ఓ ట్వీట్ చేశాడు. '1-0తేడాతో భారత్‌పై టెస్టు సిరీస్‌ ఓడిపోయాం. త్వరలో ప్రారంభయ్యే వన్డే సిరీస్‌లో శ్రీలంక 5-0 తేడాతో ఓటమి పాలవ్వకూడదని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నాడు.

అయితే తన ట్వీట్‌లో ఆర్నాల్డ్ ఓ తప్పు చేశాడు. అది మామూలు తప్పు కాదనే విషయం టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేసిన తర్వాత అతడికి అర్ధం అయింది. ఆర్నాల్డ్‌కు ట్వీట్‌కు లక్ష్మణ్
'అలాగే రసూల్‌. నీ నమ్మకం ఒమ్ము కాదు. ఎందుకంటే ఇప్పుడు జరిగేది ఐదు వన్డేల సిరీస్‌ కాదు మూడు వన్డేల సిరీస్‌ మాత్రమే కదా' అని బదులిచ్చాడు.

లక్ష్మణ్ వేసిన పంచ్‌కి సోషల్ మీడియాలో అభిమానులు ఖుష్ అవుతున్నారు. 'ఆర్నాల్డ్‌కు తమ జట్టు ఎన్ని వన్డేలు ఆడుతుందో కూడా తెలియదు', 'వెరీ వెరీ స్పెషల్‌ లక్ష్మణ్‌ తన స్టైల్లో భలే బదులిచ్చాడు' అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఇరు జట్ల మధ్య డిసెంబరు 10 నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానుంది. తొలి వన్డే కోసం ఇరు జట్లు ఇప్పటికే ధర్మశాల చేరుకున్నాయి. డిసెంబరు 10న తొలి వన్డే ధర్మశాల వేదికగా జరగనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 8, 2017, 16:21 [IST]
Other articles published on Dec 8, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+