సాగరికతో జహీర్ ఖాన్: ఇద్దరి మధ్య ప్రేమ నిజమేనా! (ఫోటోలు)
హైదరాబాద్: భారత క్రికెటర్లతో బాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది గతంలో ప్రేమాయణం నడిపిన సందర్భాలను చాలానే చూశాం. వీరిలో కొంత మంది పెళ్లిళ్లు చేసుకుని ఒక్కటవగా, మరికొందరు విడిపోయారు. అయితే తాజాగా టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ నటి సాగరిక గట్గెలు ప్రేమాయణం సాగిస్తున్నారనే వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.
గతేడాది నవంబర్‌లో క్రికెటర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి హాజెల్ కీచ్‌ల పెళ్లి వేడుకలో జహీర్ ఖాన్‌తో కలిసి సాగరిక హాజరవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. దీంతో 'చక్ దే ఇండియా' ఫేమ్ సాగరికతో జహీర్ ప్రేమలో పడ్డాడని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. ఈ ఇద్దరూ గత ఆర్నెల్లుగా డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు కూడా హల్‌చల్ చేశాయి.

‘ఇరాదా’ ప్రమోషన్‌లో జహీర్ ఖాన్
ఆ వార్తలను వీరిద్దరూ ఖండించడం విశేషం. అయితే తాజాగా సాగరిక నటించిన ‘ఇరాదా' సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రమోషన్‌కు జహీర్ ఖాన్ హాజరయ్యాడు. దీంతో ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే అనుమానాలకు మరోసారి బలం చేకూరినట్టయింది.

తన భార్య హజల్ కీచ్‌తో యువీ హాజరు
ముంబైలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి యువీ తన భార్య హజల్ కీచ్‌తో కలిసి హాజరుకాగా, మరో ఇద్దరు వెటరన్ క్రికెటర్లు ఆశిష్ నెహ్రా, అజిత్ అగార్కర్‌లు కూడా హాజరయ్యారు.

ఓ ఇంటర్యూలో జహీర్‌తో ప్రేమాయణంపై సాగరిక
సాగరిక ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో జహీర్‌తో ప్రేమాయణం గురించి మాట్లాడుతూ ‘నా వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ మీడియాతో పంచుకోలేదు. అయితే నేను మాత్రం ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను' అని చెప్పింది.
రియల్ లైఫ్ లో కాదు కదా: యువీ
శుక్రవారం 'ఇరాదా' సినిమా విడుదల సందర్భంగా సాగరికకు యువరాజ్ సింగ్ ముందుగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సినిమా హిట్ కావాలనే ఆకాంక్షించిన యువీ.. సాగరికను ఆట పట్టించే యత్నం చేశాడు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ లో సాగరికను ఉద్దేశిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశాడు. 'చక్ దే ఇండియా మూవీ హాకీ క్రీడాకారిణిగా నటించిన నీవు, భారత్ క్రికెట్ వైస్ కెప్టెన్ తో డేటింగ్ చేసి పాత్రను పోషించావు. ఇంతవరకూ బాగానే ఉంది. ఈ డేటింగ్ అనేది నిజ జీవితంలో లేదు కదా!'అని యువీ చమత్కరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications