Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీఎస్కేకు రవీంద్ర జడేజా గుడ్‌బై..? ఇన్‌స్టాలో టీం ఫోటోలు డిలీట్..? టీం అధికారి ఏమన్నాడంటే..?

Rumors Spreads About Ravindra Jadeja May leave CSK, After He Deleted CSK Posts in His Insta

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి సీఎస్కేకు సంబంధించిన 2021, 2022 సీజన్ల అన్ని పోస్టులను డిలీట్ చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు ఎంఎస్ ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించిన జడ్డూ.. మధ్యలోనే కెప్టెన్సీని వదులుకున్న సంగతి తెలిసిందే. ఇక కెప్టెన్‌గా, ప్లేయర్‌గా జడ్డూ ఐపీఎల్ 2022లో పూర్తిగా విఫలమయ్యాడు. తన వ్యక్తిగత ప్రదర్శనను మెరుగుపరుచుకోవడానికే కెప్టెన్సీకి గుడ్ బై చెబుతున్నట్లు రవీంద జడేజా అప్పట్లో స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తిరిగి ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అయినా సీఎస్కే అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది.

వెంటనే పసిగట్టిన అభిమానులు

వెంటనే పసిగట్టిన అభిమానులు

ఇక వెన్నెముక గాయంతో జడేజా ఐపీఎల్ మధ్యలోనే తప్పుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ పర్యటనకు తిరిగి రావడానికి ముందు అతను తన గాయానికి సంబంధించి పూర్తి చికిత్స తీసుకున్నాడు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో.. జడేజా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి.. సీఎస్కేకు సంబంధించిన ఐపీఎల్ 2021, ఐపీఎల్ 2022ల ఫోటోలను తొలగించినట్లు అభిమానులు గుర్తించారు. దీంతో జడ్డూ సీఎస్కే నుంచి తప్పుకోవడం ఖాయమంటూ చాలా మంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రూమర్లు వ్యాప్తి చెందాయి.

 ధోనీకి కూడా విష్ చేయలేదు

ధోనీకి కూడా విష్ చేయలేదు

ఇక జడేజా సీఎస్కే నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలకు ఆజ్యం పోసేలా జడేజా ఇటీవల ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. అతను ప్రతి సంవత్సరం ధోనీకి సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతుంటాడు. ఇక అతను తన ఇన్‌స్టాలో సీఎస్కే సంబంధిత పోస్ట్‌లను డిలీట్ చేయడం వెనక కచ్చితంగా ఏదో జరిగే ఉంటుందని అర్థమవుతుంది. ఇక ఐపీఎల్ 2022 సీజన్లో జడేజా విఫలమైనప్పటికీ.. ఇంగ్లాండ్‌తో జరిగిన అయిదో రీషెడ్యూల్డ్ టెస్టులో సత్తా చాటాడు. అద్భుతమైన శతకంతో బ్యాటింగ్లో మెరిశాడు. ప్రస్తుతం జడ్డూ టెస్ట్ ఆల్రౌండర్ల లిస్టులో తొలి స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

 జడేజా చేసిన పని అతని వ్యక్తిగతం

జడేజా చేసిన పని అతని వ్యక్తిగతం

ఇక రవీంద్ర జడేజా సీఎస్కేకు బైబై చెప్పేస్తాడంటూ వస్తున్న వార్తలపై సీఎస్కే జట్టు అధికారి ఒకరు మీడియాతో స్పందించాడు. 'చూడండి. రవి ఏం చేశాడో అది అతని వ్యక్తిగతం. మా టీం తరఫున ఎలాంటి డిసిషన్లు మేం తీసుకోలేదు. ఎవ్రీతింగ్ ఫైన్. ఇలాంటి ఊహాగానాలపై ఇంతకంటే పెద్దగా స్పందించదల్చుకోలేదు.' అంటూ పేర్కొన్నాడు. మరి ఇంతకీ జడ్డూ ఏం ఫీలవుతున్నాడు. ? అతను సీఎస్కేకు టాటా చెప్పేస్తాడా.? అందుకే ధోనీకి విషెస్ చెప్పలేదా? అసలు ధోనీకి జడ్డూకు మధ్య ఏమైనా పొరపొచ్చాలొచ్చాయా? అన్ని ప్రశ్నలకు క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Story first published: Saturday, July 9, 2022, 16:55 [IST]
Other articles published on Jul 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+