న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంచేస్తామనే కామెంట్ల‌పై దిమ్మ‌తిరిగిపోయే స‌మాధానం ఇచ్చిన బంగ్లా

ICC Cricket World Cup 2019 : Rubel Hossain Hilariously Replies To Gulbadin Naib’s Jibe || Oneindia
Rubel Hossain responds hilariously to Naibs tweet

లండ‌న్‌: మేము ఎలాగూ మునిగిపోయాం. పోతూ, పోతూ మిమ్మ‌ల్నీ ముంచి వెళ్తాం..అంటూ ఆఫ్ఘ‌నిస్తాన్ క్రికెట్ జ‌ట్టు కేప్టెన్ గుల్బ‌దీన్ న‌యీబ్‌.. బంగ్లాదేశ్ టీమ్‌కు చేసిన హెచ్చ‌రిక‌లు గాలివాట‌మేన‌ని తేలిపోయింది. బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చేతులెత్తేసింది ఆఫ్ఘ‌నిస్తాన్ టీమ్‌. విజ‌యం సాధించ‌డం అనేది మాట‌లు చెప్పినంత తేలిక కాద‌ని ఆప్ఘ‌న్ కేప్టెన్ గుల్బ‌దీన్‌కు అర్థమైపోయి ఉండొచ్చు. టీమిండియాపై గెల‌పు అంచుల దాకా వెళ్లిన ఆత్మ‌విశ్వాసం వ‌ల్ల ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు కేప్టెన్‌.. ఈ వ్యాఖ్యాలు చేసిన‌ప్ప‌టికీ.. చేత‌ల్లో మాత్రం చూపించ‌లేక‌పోయారు.

ఆఫ్ఘ‌నిస్తాన్‌పై ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసిన త‌రువాత బంగ్లాదేశ్ టీమ్ ఆట‌గాడు రుబెల్ హొస్సైన్‌ త‌న కౌంట‌ర్ పార్ట్ గుల్బదీన్‌ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేశారు. మీతో క‌లిసి మునిగిపోయేంత‌టి ప్ర‌యాణాన్ని తాము కోరుకోవ‌ట్లేద‌ని అన్నారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌తో టీమ్‌తో క‌లిసి మునిగిపోయేంత స‌మ‌యం కూడా త‌మ వ‌ద్ద లేద‌ని చుర‌క‌లు అంటించారు.

అతి విశ్వాసంగా ఆత్మ‌విశ్వాసం..
ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్‌లో తాము నిండా మునిగిపోయామ‌ని, ఇక బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టును కూడా ముంచేస్తామ‌ని గుల్బ‌దీన్ చెప్పుకొచ్చారు. తాము సెమీఫైన‌ల్‌కు వెళ్లే అవ‌కాశాలు లేవ‌ని, బంగ్లాదేశ్ జ‌ట్టును కూడా అడ్డుకుంటామ‌ని ఆయ‌న అన్నారు. హ‌మ్ డూబ్ చుకె హై స‌న‌మ్‌. తుమ్‌కో లేక‌ర్ డూబేంగే.. అని ఓ సెటైరిక‌ల్‌గా ఓ వార్నింగ్ మెసేజీని ఇచ్చారు. మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో గుల్బ‌దీన్ మాట్లాడారు.

బంగ్లాదేశ్‌తో జ‌రిగే మ్యాచ్‌లో త‌మ స‌ర్వ‌శ‌క్తుల‌ను ఒడ్డి, విజ‌యం సాధిస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. మిగిలిన జ‌ట్ల‌తో పోల్చుకుంటే.. బంగ్లాదేశ్ జ‌ట్టుతో ఎక్కువ సార్లు ఢీ కొన్న అనుభ‌వం త‌మకు ఉంద‌ని అన్నారు. బంగ్లాదేశ్ విజ‌యాల‌కు క‌ళ్లెం వేస్తామ‌ని చెప్పారు. ఇలాంటి మాట‌ల తూటాల‌ను ఆఫ్ఘ‌నిస్తాన్ బాగానే పేల్చ‌గలిగింది గానీ.. గ్రౌండ్‌లో దిగేట‌ప్ప‌టికీ.. ఆ స్థాయిలో ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించ‌లేదు. ఫ‌లితంగా 64 ప‌రుగుల తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మి చ‌వి చూసింది.

Story first published: Tuesday, June 25, 2019, 19:11 [IST]
Other articles published on Jun 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X