RSWS 2022 : ఏజ్ ఇస్ జస్ట్ నంబర్.. సొగసైన షాట్లతో ఉర్రూతలూగించిన సచిన్.. వరణుడు బ్రేకులేశాడు గానీ లేకపోతే!

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ తరఫున భారత దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. సచిన్ బరిలోకి దిగే టైంలో స్టేడియంలో అభిమానులు ఓ రేంజులో హోరెత్తారు. ఇక ఉన్నంత సేపు సచిన్ తన టాప్-క్లాస్ షాట్లో అభిమానులను ఉర్రూతలూగించాడు. న్యూజిలాండ్ లెజెండ్స్ తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
దీంతో సచిన్ టెండూల్కర్, నమన్ ఓజా కలిసి ఓపెనింగ్‌కు దిగారు. తొలి ఇన్నింగ్స్‌లో మొదటి ఓవర్‌లో.. కైల్ మిల్స్ వేసిన బంతిని సచిన్ అద్భుతంగా బ్యాక్ ఫుట్ కవర్ డ్రైవ్ చేసి తొలి బౌండరీని సాధించాడు. మరుసటి ఓవర్‌లోనే షేన్ బాండ్ బౌలింగ్‌లో సచిన్ సొగసైన పుల్ షాట్‌తో రెండో బౌండరీ సాధించాడు. మిల్స్ బౌలింగ్‌లో సచిన్ అద్భుతమైన స్కూప్ షాట్‌తో బౌండరీ సాధించాడు. మొత్తం నాలుగు ఫోర్లతో సచిన్ తన మార్క్ ఆటను చూపించాడు.
ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో..
సచిన్, ఓజా ఓపెనింగ్ వికెట్‌కు 32పరుగులు జోడించారు. షేన్ బాండ్.. ఓజా (15బంతుల్లో 18పరుగులు 2ఫోర్లు, 1సిక్సర్)ను ఔట్ చేశాడు. ఇక వర్షం కారణంగా మ్యాచ్ ముగిసే సరికి.. టెండూల్కర్ (13బంతుల్లో 19పరుగులు 4ఫోర్లు నాటౌట్), సురేష్ రైనా (9పరుగులు 7బంతుల్లో 1ఫోర్ నాటౌట్) పరుగులతో ఉన్నారు. 5.1ఓవర్లలో 1వికెట్ నష్టానికి భారత లెజెండ్స్ 49పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా మళ్లీ మ్యాచ్ మొదలు కాకపోవడంతో సచిన్ ఆటను మరింత చూడలేకపోయాం. ఇక ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇకపోతే ఇండియా లెజెండ్స్ తమ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా లెజెండ్స్‌పై 63పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
వరల్డ్ సేఫ్టీ సిరీస్ పాయింట్ల పట్టిక ఇలా
సచిన్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ ఇప్పుడు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. కాన్పూర్లో వెస్టిండీస్ లెజెండ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దవ్వడంతో ఆ మ్యాచ్‌కు కూడా ఒక్క పాయింటే లభించింది. ఇకపోతే పాయిట్ల పట్టికలో శ్రీలంక లెజెండ్స్ మూడు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి 6పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. వెస్టిండీస్ మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి, ఒక డ్రాతో 5పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. ఇక వరుసగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ 4,5, 6, 7, 8 స్థానాల్లో ఉన్నాయి.
ఇరు జట్లు
ఇండియా లెజెండ్స్: సచిన్ టెండూల్కర్ (సి), నమన్ ఓజా (డబ్ల్యు), సురేశ్ రైనా, స్టువర్ట్ బిన్నీ, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, మన్‌ప్రీత్ గోనీ, మునాఫ్ పటేల్, రాహుల్ శర్మ, ప్రజ్ఞాన్ ఓజా, హర్భజన్ సింగ్, ఎస్ బద్రీనాథ్, రాజేష్ పవార్ , వినయ్ కుమార్, అభిమన్యు మిథున్.
న్యూజిలాండ్ లెజెండ్స్: అంటోన్ డెవ్‌సిచ్, జామీ హౌ, డీన్ బ్రౌన్లీ, రాస్ టేలర్(సి), గారెత్ హాప్‌కిన్స్(w), స్కాట్ స్టైరిస్, నీల్ బ్రూమ్, కైల్ మిల్స్, హమీష్ బెన్నెట్, జాసన్ స్పైస్, జేమ్స్ ఫ్రాంక్లిన్, క్రైగ్ మెక్‌మిలన్, జాకబ్ ఓరమ్, బాండ్, ఆరోన్ రెడ్‌మండ్, బ్రూస్ మార్టిన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications