Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్కో బంతికి రూ.30 లక్షలు.. డకౌట్ అయినా డబ్బులే డబ్బులు.. మ్యాచ్‌కు ఎన్ని కోట్లంటే?

Rishabh Pant: ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడైన రిషబ్ పంత్ బ్యాటింగ్ లోనే కాకుండా.. వికెట్ల వెనుక కీపింగ్ లో కూడా విఫలమయ్యాడు. రిషబ్ పంత్ చేసిన పొరపాట్ల కారణంగానే లక్నో సూపర్ జెయింట్స్ ఓటమిపాలైందని పలువురు మాజీ క్రికెటర్లు చెబుతున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025(IPL 2025) మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను రూ.27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన రిషబ్ పంత్ మొదటి మ్యాచ్‌లోనే విఫలం కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ సీజన్ లో ప్రతి జట్టు కనీసం 14 మ్యాచ్‌లు ఆడుతుంది. మొత్తం 14 మ్యాచ్‌లు అంటే.. రిషబ్ పంత్ ధరను బట్టి చూస్తే.. ఒక్కో మ్యాచ్ ఫీజు రూ.2కోట్లు అన్నమాట. అంటే మ్యాచ్ లో డకౌట్ అయినా.. రిషబ్ పంత్ సంపాదన మ్యాచ్ కు రూ.2 కోట్లు. ఈ క్రమంలో రిషబ్ పంత్ ఆడిన 6 బంతులకు రూ.30 లక్షల చొప్పున సంపాదించినట్లుగా తెలుసుకోవచ్చు. రిషబ్ పంత్ మ్యాచ్ లో డకౌట్ అయినా కోట్లు సంపాదించినట్లు పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

Rs 30 Lakhs Per Ball Rishabh Pant s Costly Mistakes in IPL 2025 Match
Take a Poll

లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్ బ్యాటింగ్ లో విఫలం మాత్రమే కావడమే కాదు.. వికెట్ కీపింగ్‌లోనూ విఫలమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 15వ ఓవర్ ను లక్నో బౌలర్ షాబాద్ అహ్మద్ బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో ఢిల్లీ బ్యాటర్ అశుతోష్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను రిషబ్ పంత్ జారవిడిచాడు. అనంతరం అశుతోష్ శర్మ ఈ మ్యాచ్ ను ఒంటిచేత్తో గెలిపించాడు. రిషబ్ పంత్ ఆ క్యాచ్ పట్టి ఉంటే లక్నో సులభంగా మ్యాచ్ గెలిచేది. ఇది మాత్రమే కాకుండా.. మ్యాచ్ చివరి ఓవర్ లో రిషబ్ పంత్ మరో తప్పు చేశాడు. షాబాద్ అహ్మద్ వేసిన చివరి ఓవర్ తొలి బంతికి మోహిత్ శర్మ స్టంపింగ్ ను కూడా రిషబ్ పంత్ మిస్ అయ్యాడు. ఈ స్టంపింగ్ పూర్తి చేసి ఉంటే లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ విజయం సాధించి ఉండేది. ఢిల్లీ అప్పటికే తొమ్మిది వికెట్లు కోల్పోగా... ఒకవేళ రిషబ్ పంత్ స్టంపింగ్ చేసి ఉంటే కచ్చితంగా లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ గెలిచేది.

ఈ పరాజయం అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ .. ప్రతి మ్యాచ్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నామన్నారు. ఇది టోర్నమెంట్ ప్రారంభం మాత్రమేనని.. రానున్న మ్యాచ్ లలో అద్భుతంగా రాణిస్తామని రిషబ్ పంత్ స్పష్టం చేశారు.

Story first published: Wednesday, March 26, 2025, 15:20 [IST]
Other articles published on Mar 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+