Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రూ.21 కోట్లు బొక్కా.. నెట్స్‌లో బాహుబలి.. మ్యాచ్‌లో బకరా!

ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఈ విండీస్ వీరుడు.. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తాజాగా నికోలస్ పూరన్ నెట్స్ లో సిక్సర్లు బాదుతున్న వీడియోను లక్నో ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. 'ఈ బ్యాటింగ్ కేవలం ప్రాక్టీస్ సెషన్లకే పరిమితమా?' అంటూ నెటిజన్లు పూరన్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

కోలుకోలేని దెబ్బ తీస్తున్న నికోలస్ పూరన్!
లక్నో ఫ్రాంచైజీ నుంచి ఏడాదికి రూ.21 కోట్ల భారీ వేతనం అందుకుంటున్న నికోలస్ పూరన్.. ప్రస్తుత సీజన్లో ఆడిన 5 మ్యాచ్ ల్లో కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో నికోలస్ పూరన్ సగటు 8.40 కాగా.. స్ట్రైక్ రేట్ 76.36గా నమోదైంది. నికోలస్ పూరన్ లాంటి విధ్వంసకర ఆటగాడి నుంచి ఇలాంటి గణాంకాలు రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సీజన్లో ఆయన అత్యధిక స్కోరు 19 పరుగులు మాత్రమే కావడం గమనార్హం.

Rs 21 Crore Flop Nicholas Pooran Brutally Trolled for Poor Form in IPL 2026 as LSG Struggles

మ్యాచ్ విషయానికి వస్తే..
ఇటీవల ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కూడా లక్నో జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో, నిర్ణీత ఓవర్లలో కేవలం 146 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ బౌలర్లు రసిఖ్ సలామ్ దార్ (4/24), భువనేశ్వర్ కుమార్ (3/27) అద్భుతమైన స్పెల్స్‌తో లక్నో బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ (49), రజత్ పటిదార్ (27) రాణించడంతో ఆర్సీబీ 15.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.

వరుస పరాజయాలతో సతమతమవుతున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టు, ప్లే-ఆఫ్స్ రేసులో నిలవాలంటే నికోలస్ పూరన్ లాంటి కీలక ఆటగాళ్లు వెంటనే ఫామ్‌లోకి రావడం అత్యవసరం. పూరన్ తన పాత ఫామ్‌ను అందిపుచ్చుకుని తదుపరి మ్యాచ్‌ల్లో మెరుపులు మెరిపిస్తారో లేదో వేచి చూడాలి.

Story first published: Saturday, April 18, 2026, 7:33 [IST]
Other articles published on Apr 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+