Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RRvsSRH : బ్రూక్ కోసం ఫిలిప్స్‌ను వదిలేశారా?.. సన్‌రైజర్స్ పై మండి పడుతున్న ఫ్యాన్స్!

చివరి బంతి వరకు థ్రిల్లర్ సినిమాలా సాగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో విజయం ఆరెంజ్ ఆర్మీనే వరించింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అనూహ్యంగా ఓటమిపాలైంది. చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. బంతి అందుకున్న సందీప్ శర్మ ఈ మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. చివరి బంతికి నోబాల్ వేసి ఆ జట్టు కొంప ముంచాడు.

ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ (95), సంజూ శాంసన్ (66 నాటౌట్), యశస్వి జైస్వాల్ (35) చెలరేగడంతో.. రాజస్థాన్ 217 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్‌లో సన్‌రైజర్స్‌ కూడా అదరగొట్టింది. కుర్ర ఓపెనర్లు అన్‌మోల్ ప్రీత్ సింగ్ (33), అభిషేక్ శర్మ (55) రాణించారు. రాహుల్ త్రిపాఠీ (47) కూడా చాలా రోజుల తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడాడు.

Glenn Phillips
Photo Credit:

హెన్రిక్ క్లాసెన్ (26) ఆకట్టుకోగా.. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (6) ఫెయిలయ్యాడు. అయితే చివర్లో కేవలం ఏడు బంతులే ఆడిన గ్లెన్ ఫిలిప్స్ (25) ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. రాజస్థాన్ యువ పేసర్ కుల్దిప్ యాదవ్ వేసిన ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయంలో అతని ఇన్నింగ్స్ చాలా కీలకంగా మారింది.

అయితే ఇన్ని రోజులు ఫిలిప్స్‌ను పక్కన పెట్టి వరుసగా విఫలం అవుతున్నా కూడా హ్యారీ బ్రూక్‌నే సన్‌రైజర్స్ ఆడించింది. దీనిపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి సూపర్ ప్లేయర్‌ను ఇప్పటి వరకు ఎక్కడ దాచి పెట్టార్రా? అంటూ సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో న్యూజిల్యాండ్ తరఫున కూడా ఫినిషర్‌గా ఫిలిప్స్ చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

ఈ కివీస్ ఫినిషర్ సత్తా చూడబట్టే అతన్ని సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. కానీ బ్రూక్ కోసం అతన్ని పక్కన పెట్టి చాలా పెద్ద తప్పు చేసింది. ఈ సీజన్‌లో మార్క్రమ్, క్లాసెన్ లేనప్పుడు సన్‌రైజర్స్ వికెట్ కీపర్‌గా ఫిలిప్స్ ఆడాడు. ఆ తర్వాత మళ్లీ జట్టులో చోటివ్వలేదు. ఇప్పుడు ప్లేఆఫ్స్ చేరడం సన్‌రైజర్స్‌కు దాదాపు అసాధ్యంగా మారిన తర్వాత అతనికి అవకాశం ఇచ్చారు.

ఫిలిప్స్ ఈ మ్యాచ్‌లో తను ఎంత కీలకమైన ఆటగాడో నిరూపించుకున్నాడు. అతని ఆట చూసిన ఫ్యాన్స్ అయితే సన్‌రైజర్స్‌పై మండిపడుతున్నారు. 'ఆ మాయదారి బ్రూక్ కోసం ఫిలిప్స్‌ను పక్కన పెట్టారా?' అని కొందరు తిడుతుంటే.. ఫిలిప్స్‌ను ఆడించి ఉంటే ఇప్పటికి సన్‌రైజర్స్ ఎన్ని మ్యాచులు గెలిచేదో అని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సన్‌రైజర్స్ యాజమాన్యం కళ్లు తెరిచిందని ఇంకొంత మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Monday, May 8, 2023, 10:03 [IST]
Other articles published on May 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+