సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అనూహ్యంగా ఓటమిపాలైంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను సన్‌రైజర్స్ ఓడించింది. చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. బంతి అందుకున్న సందీప్ శర్మ ఈ మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. చివరి బంతికి నోబాల్ వేసి ఆ జట్టు కొంప ముంచాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు చేసింది. జోస్ బట్లర్ (95), సంజూ శాంసన్ (66 నాటౌట్), యశస్వి జైస్వాల్ (35) ముగ్గురూ మంచి స్కోర్లు చేశారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్‌లో సన్‌రైజర్స్‌కు కుర్ర ఓపెనర్లు అన్‌మోల్ ప్రీత్ సింగ్ (33), అభిషేక్ శర్మ (55) ఇద్దరూ మంచి ఆరంభం అందించారు.

రాహుల్ త్రిపాఠీ (47) కూడా చాలా రోజుల తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. హెన్రిక్ క్లాసెన్ (26)తోపాటు గ్లెన్ ఫిలిప్స్ (25) ధనాధన్ షాట్లతో చెలరేగాడు. ఇక చివరి బంతికి ఐదు పరుగులు అవసరమైన సమయంలో సందీప్ నోబాల్ వేశాడు. ఆ మరుసటి బంతికి సమద్ చక్కని షాట్‌తో భారీ సిక్సర్ బాదాడు. దీంతో సన్‌రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.
అయితే మ్యాచ్ రాజస్థాన్ చెయ్యి జారింది ఈ నోబాల్ దగ్గర కాదు. అంతకుముందు సంజూ చేసిన ఈ రెండు తప్పిదాల వల్లనే అంటున్నారు నిపుణులు.సన్‌రైజర్స్ బ్యాటింగ్ సమయంలో రాజస్థాన్ ఫీల్డింగ్ అంత గొప్పగా లేదు. ముఖ్యంగా కెప్టెన్ సంజూ శాంసన్ కూడా ఒకటి, రెండు క్యాచులు మిస్ చేశాడు. త్రిపాఠీ ఇచ్చిన ఈజీ క్యాచ్ కూడా నేలపాలు చేశాడు. అంత చేసినా కూడా చివరి బంతి వరకు మ్యాచ్ రావడం అద్భుతమే.
దానికితోడు తను వేసిన రెండు ఓవర్లలో భారీగా పరుగులు ఇచ్చిన మురుగన్ అశ్విన్‌కు మూడోసారి బంతి ఎందుకిచ్చాడో తెలియడం లేదు. రాజస్థాన్ దగ్గర మరో బౌలింగ్ ఆప్షన్ ఏదీ లేకపోతే అతనికి మూడో ఓవర్ ఇవ్వొచ్చు. కానీ అలాంటి సమస్యేం లేదు. అలాగే చివరి రెండు ఓవర్లలో సన్‌రైజర్స్ గెలవాలంటే 41 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు.. ఏ కెప్టెన్ అయినా సరే అక్కడే అంటే 19వ ఓవర్లోనే ప్రత్యర్థికి అవకాశాలు లేకుండా చేస్తాడు.
సంజూ వద్ద సందీప్ శర్మ, ఓబెడ్ మెకాయ్ వంటి డెత్ ఓవర్ స్పెషలిస్టులు కూడా ఉన్నారు. కానీ వీరిద్దరినీ కాదని కుర్ర బౌలర్ కుల్దిప్ యాదవ్‌కు బంతి ఇచ్చాడు సంజు. అతని అనుభవలేమిని బాగా యూజ్ చేసుకున్న గ్లెన్ ఫిలిప్స్ ఎలాంటి విధ్వంసం సృష్టించాడో చూశాం. అయితే కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యి ఓడిపోయింది. కానీ ఆ మ్యాచ్‌లో రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు కొట్టాడు. మళ్లీ అలాంటి పరిస్థితే వచ్చినా ఆ ఫీట్ రిపీట్ చేయడం అతనికే సాధ్యం కాదు.
కాబట్టి ఒకసారి అనూహ్య పరిస్థితుల్లో ఫలానా స్ట్రాటజీ పని చేయలేదు కాబట్టి.. ఇక అది వేస్ట్ అనుకోవడం చాలా పెద్ద తప్పు. దానికి తోడు క్రీజులో ఉన్న అబ్దుల్ సమద్ అంత గొప్ప ఫామ్‌లో లేడు. సాధారణంగా అయితే సమద్ కూడా రింకూలా చెలరేగుతాడేమో కానీ.. అంత గొప్ప ఫామ్‌లో లేకుండా అలాంటి ఫీట్ సాధించడం ఎవరికైనా కష్టమే కదా. ఇలా మ్యాచ్‌ను పరిశీలిస్తే సంజూ తీసుకున్న ఈ రెండు చెత్త నిర్ణయాల వల్లే రాజస్థాన్ ఓడిందని అర్థం చేసుకోవచ్చు.