Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RRvsSRH : నో బ్రూక్.. మయాంక్ కూడా అవుట్.. సన్‌రైజర్స్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ మరో కీలకమైన పోరుకు రెడీ అయింది. రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడేందుకు రెడీ అయింది. జైపూర్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచాడు. జైపూర్‌లో ఇటీవల పెద్దగా మంచు ప్రభావం లేదని చెప్పిన అతను.. తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని తెలిపాడు.

ఇంతకుముందు గుజరాత్ స్పిన్నర్లు చెలరేగిన పిచ్ మీదనే ఈ మ్యాచ్ కూడా జరుగుతోంది. ఆ మ్యాచ్‌లో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్ వేశారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో ఎక్కువ మంది స్పిన్నర్లను తీసుకుంది. అంతేకాదు, ఇంగ్లండ్ మాజీ సారధి జో రూట్ కూడా ఈ మ్యాచ్ ఆడుతున్నట్లు సంజూ వెల్లడించాడు.

Brook and Mayank Agarwal left out for SRH clash with RR

తమ జట్టులో ప్రధాన పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఆడటం లేదని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా స్పిన్‌పై ఫోకస్ పెట్టిన రాజస్థాన్ టీం మేనేజ్‌మెంట్ రవిచంద్రన్ అశ్విన్‌తోపాటు మురుగన్ అశ్విన్ ఆడుతున్నట్లు తెలిపింది. అలాగే బౌల్ట్ స్థానంలో జో రూట్ ఆడుతున్నట్లు చెప్పాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో అవసరం అయితే ఆడమ్ జంపాను బరిలోకి దింపే అవకాశం కూడా కనిపిస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కూడా తమ జట్టులో కీలక మార్పులు చేసినట్లు వెల్లడించాడు. వరుసగా విఫలం అవుతున్న హ్యారీ బ్రూక్‌ను పక్కన పెట్టేసినట్లు తెలిపాడు. అతనితోపాటు మయాంక్ అగర్వాల్ కూడా ఆడటం లేదన్నాడు. ఉమ్రాన్ మాలిక్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. అగర్వాల్, బ్రూక్ ఇద్దర్నీ పక్కన పెట్టినందుకు ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీలవుతున్నారు.

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, మొహ్‌సిన్ అశ్విన్, సందీప్ శర్మ, కుల్దిప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిక్ క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, మార్కో యాన్సెన్, వివ్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్

Story first published: Sunday, May 7, 2023, 19:30 [IST]
Other articles published on May 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+