Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RRvsSRH : వాళ్లిద్దరి ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే: మార్క్రమ్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అనూహ్యంగా ఓటమిపాలైంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను సన్‌రైజర్స్ ఓడించింది. చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. బంతి అందుకున్న సందీప్ శర్మ ఈ మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. చివరి బంతికి నోబాల్ వేసి ఆ జట్టు కొంప ముంచాడు.

చివరి బంతి వరకు హైడ్రామా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అనూహ్య విజయం సాధించింది. ఈ థ్రిల్లింగ్ విక్టరీపై సన్‌రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ సంతోషం వ్యక్తం చేశాడు. 'మ్యాచ్ చివర్లో మా ఎమోషన్స్ క్షణాల్లోనే మారిపోయాయి. ఇలా విజయం సాధించడం సంతోషంగా ఉంది. జట్టులో అందరూ ఈ విజయానికి సాయం చేశారు' అని మెచ్చుకున్నాడు.

RRvsSRH

అలాగే తమకు మంచి ఓపెనింగ్ లభించిందని, అది కూడా విజయంలో చాలా కీలక పాత్ర పోషించిందని చెప్పాడు. 'ఇక్కడ అవుట్ ఫీల్డ్ చాలా వేగంగా ఉంది. కాబట్టి మేం ఈ స్కోర్ ఛేదించగలమని గట్టిగా నమ్మాం. అభిషేక్‌కు చక్కని ఆరంభం దొరికింది. త్రిపాఠీ ఆ మొమెంటం మిస్ అవకుండా చూసుకున్నాడు' అని తన టీంమేట్స్‌ ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు.

'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' గ్లెన్ ఫిలిప్స్ ఎలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడో తెలిసిందే. కేవలం 7 బంతుల్లోనే అతను 25 పరుగులు చేశాడు. సమద్ కూడా 7 బంతుల్ల 17 బంతులతో అజేయంగా నిలిచి, జట్టుకు విజయం అందించాడు. దీన్ని కూడా ప్రస్తావించిన మార్క్రమ్.. 'మంచి ఆరంభం దొరికిన తర్వాత మంచి కామియోలు ఆడితే చాలు అనుకున్నా. ఫిలిప్స్, సమద్ ఆట ఎంత సూపర్‌గా ఉందో మాటల్లో చెప్పలేను' అని చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు చేసింది. జోస్ బట్లర్ (95), సంజూ శాంసన్ (66 నాటౌట్), యశస్వి జైస్వాల్ (35) ముగ్గురూ మంచి స్కోర్లు చేశారు. ముఖ్యంగా శాంసన్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ ఛేజింగ్‌ను సన్‌రైజర్స్ కూడా బాగానే మొదలు పెట్టింది.

కుర్ర ఓపెనర్లు అన్‌మోల్ ప్రీత్ సింగ్ (33), అభిషేక్ శర్మ (55) ఇద్దరూ అద్భుతమైన ఓపెనింగ్ అందించారు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠీ (47) కూడా చాలా రోజుల తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. హెన్రిక్ క్లాసెన్ (26)తోపాటు గ్లెన్ ఫిలిప్స్ కూడా ధనాధన్ షాట్లతో చెలరేగాడు. చివర్లో అబ్దుల్ సమద్ ఈ మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.

చివరి బంతికి ఐదు పరుగులు అవసరమైన సమయంలో సందీప్ నోబాల్ వేశాడు. ఆ మరుసటి బంతికి సమద్ చక్కని షాట్‌తో భారీ సిక్సర్ బాదాడు. దీంతో సన్‌రైజర్స్ డగౌట్ సంబరాల్లో మునిగిపోయింది. చివరి బంతికి జరిగిన హైడ్రామాను రాజస్థాన్ ఫ్యాన్స్ ఏమాత్రం నమ్మలేకపోయారు.

Story first published: Monday, May 8, 2023, 7:47 [IST]
Other articles published on May 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+