Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RRvsRCB : కీలకమైన మార్పులతో బరిలో దిగిన ఆర్సీబీ.. రాజస్థాన్‌పై గెలిచేనా?

రాజస్థాన్ రాయల్స్‌తో కీలకమైన మ్యాచ్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెడీ అయింది. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పిచ్ నుంచి స్పిన్నర్లకు కొంత సహకారం లభించే అవకాశం ఉంది. ఇక్కడ చివరగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 200 పైచిలుకు స్కోరు చేసింది.

అయితే ఇది డే-మ్యాచ్ కావడంతో స్పిన్నర్లకు కొంత సహకారం లభించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ సారధి డుప్లెసిస్ టాస్ గెలిచాడు. ముందుగా బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నామని, ఎండ కూడా తన నిర్ణయంపై ప్రభావం చూపించిందని చెప్పాడు. ఇప్పటి వరకు ఈ ఐపీఎల్‌లో ఆర్సీబీ, ఆర్ఆర్ రెండూ కూడా బ్యాటింగ్ మొదట చేసిన నాలుగు మ్యాచుల్లో విజయాలు సాధించాయి.

 Bangalore makes two key changes to their team

తమ జట్టులో రెండు కీలక మార్పులు చేసినట్లు డుప్లెసిస్ వెల్లడించాడు. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్, వానిందు హసరంగ ఇద్దరికీ చిన్న గాయాలయ్యాయని తెలిపాడు. హాజిల్‌వుడ్ స్థానంలో వేన్ పార్నెల్, హసరంగ స్థానంలో మైకేల్ బ్రేస్‌వెల్ ఆడుతున్నట్లు చెప్పాడు. పిచ్ కొంత డ్రైగా కనిపిస్తోందని, అందుకే ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.

టాస్ గెలిచి ఉంటే తాను కూడా ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే వాడినని సంజూ శాంసన్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ ఆడటం లేదని, అతని స్థానంలో ఆడమ్ జంపా ఆడుతున్నాడని వెల్లడించాడు. తాము ఇప్పటి వరకు సీజన్‌లో మంచి నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నామని అభిప్రాయపడ్డాడు. బౌల్ట్‌కు గాయం ఏమీ కాలేదని, కానీ జంపా కోసం అతన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, కేఎం ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, అనూజ్ రావత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్, మైకేల్ బ్రేస్‌వెల్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్

Story first published: Sunday, May 14, 2023, 15:39 [IST]
Other articles published on May 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+