Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RRvsPBKS : మలింగను దాటేసిన చాహల్.. ఇక ఒక్కడే మిగిలాడు!

ఐపీఎల్ హిస్టరీలో సూపర్ బౌలర్ల పేర్లు రాస్తే వాటిలో కచ్చితంగా శ్రీలంక పేసర్ లసిత్ మలింగ్ పేరు ఉంటుంది. ఐపీఎల్‌లో చాలా జట్లను గజగజలాడించిన ఘనత మలింగ సొంతం. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా అప్పట్లో రికార్డు సృష్టించాడు. అయితే ఆ తర్వాత మలింగ రిటైర్ అయిపోయాడు. అనంతరం విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో వచ్చి మలింగ రికార్డును బద్దలు కొట్టాడు.

మలింగ తన కెరీర్‌లో మొత్తం 170 ఐపీఎల్ వికెట్లు తీశాడు. ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత డ్వేన్ బ్రావో కూడా అద్భుతంగా రాణించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎన్నో మరపురాని స్పెల్స్ వేశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బ్రావో కన్నా బెటర్ ఆప్షన్ ఆ జట్టు వద్ద లేకుండా పోయింది. అంత గొప్పగా బౌలింగ్ చేసిన బ్రావో.. తన ఐపీఎల్ కెరీర్‌లో 183 వికెట్లు తీసి మలింగను దాటేశాడు.

yuzvendra chahal rr

భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా ఈ జాబితాలో నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కి టాప్ పొజిషన్‌కు దూసుకొస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మలింగను చాహల్ దాటేశాడు. పంజాబ్ కింగ్స్ ,రాజస్థాన్ రాయల్స్ తరఫున జరిగిన మ్యాచ్‌లో ధాటిగా ఆడుతున్న జితేష్ శర్మను చాహల్ అవుట్ చేశాడు. చాహల్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయిన జితేష్.. రియాన్ పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఈ వికెట్‌తో చాహల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మలింగను దాటేశాడు. మలింగ తన కెరీర్‌లో 170 వికెట్లు తీసుకోగా.. జితేష్ వికెట్ చాహల్‌కు తన ఐపీఎల్ కెరీర్‌లో 171వది. గత సీజన్‌లో పర్పుల్ క్యాప్ అందుకున్న చాహల్.. ఈ ఏడాది కూడా అదే రేంజ్‌లో రాణిస్తే.. కచ్చితంగా డ్వేన్ బ్రావో రికార్డు కూడా బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ జాబితాలో 159 వికెట్లతో రవిచంద్రన్ అశ్విన్ ఐదో స్థానంలో ఉండటం గమనార్హం.

Story first published: Thursday, April 6, 2023, 10:51 [IST]
Other articles published on Apr 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+