Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RRvsKKR : టీమిండియాకు ఆడేందుకు రెడీ.. కుర్ర ఓపెనర్‌పై మాజీ లెజెండ్ ధీమా!

రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రస్తుత రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు దేశవాళీల్లో కూడా జైస్వాల్ అదరగొట్టాడు. అదే ఫామ్‌ను ఐపీఎల్‌లో కూడా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ క్రమంలో భారత జట్టుకు ఆడేందుకు జైస్వాల్ సిద్ధంగా ఉన్నాడని మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ అన్నాడు. జైస్వాల్ ఫామ్ చూస్తుంటే అద్భుతంగా కనిపిస్తున్నాడని మెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ అరంగేట్రం చేయకుండా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆసీస్ ప్లేయర్ షాన్ మార్ష్‌ పేరిట ఉన్న రికార్డును కూడా జైస్వాల్ బద్దలు కొడతాడని ధీమా వ్యక్తం చేశాడు.\

yashasvijaiswal

'జైస్వాల్ ఇలా ఆడటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. దేశవాళీల్లో అద్భుతంగా ఆడిన అతను.. అదే ఫామ్‌ను ఇక్కడ కూడా కొనసాగిస్తూ ఈ బిగ్ స్టేజ్‌పై సత్తా చాటుతున్నాడు. ఇది చూస్తేనే అతను టీమిండియాకు ఆడేందుకు రెడీగా ఉన్నట్లు అర్థం అవుతుంది. ఈ సీజన్‌లో ఇంకొన్ని మ్యాచులు ఆడాల్సి ఉంది. కాబట్టి అతను గణాంకాలు మరింత మెరుగవుతాయి. ఈ లెక్కన అతను కచ్చితంగా షాన్ మార్ష్‌ను దాటేస్తాడు' అని పఠాన్ అన్నాడు.

అలాగే మార్ష్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టడం తనకు చూడాలని ఉందని, అదే జరిగితే మరింత మంది భారత కుర్రాళ్లలో స్ఫూర్తి నింపుతుందని పఠాన్ అభిప్రాయపడ్డాడు. 'ఒత్తిడిని తట్టుకునే సత్తా తనకుందని జైస్వాల్ నిరూపించుకున్నాడు. దేశవాళీల్లో రాణించిన చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌కు వచ్చే సరికి తేలిపోయిన సంగతి తెలిసిందే. కానీ జైస్వాల్ మాత్రం ఆ కోడ్ క్రాక్ చేశాడు' అని కొనియాడాడు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో జైస్వాల్ అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్నాడు. తనతోపాటు ఓపెనింగ్ చేసే జోస్ బట్లర్ కన్నా విధ్వంసకర ఆటతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడిన అతను 43.36 సగటుతో 477 పరుగులు చేశాడు. వీటిలో మూడు హాఫ్ సెంచరీలు, ఒక అద్భుతమైన సెంచరీ ఉన్నాయి.

Story first published: Thursday, May 11, 2023, 15:59 [IST]
Other articles published on May 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+