కచ్చితంగా ప్లేఆఫ్స్ చేరుతుందని అనుకున్న రాజస్థాన్ రాయల్స్.. వరుస ఓటములతో ఈ రేసులో వెనుక బడింది. అదే సమయంలో థ్రిల్లింగ్ విక్టరీలతో కేకేఆర్ ఈ పోటీలో ముందడుగు వేసింది. ఈ రెండు జట్లు కీలకమైన పోరుకు రెడీ అయ్యాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సంజూ శాంసన్ ముందుగా బౌలింగ్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇది చాలా పెద్ద టోర్నమెంట్ అని, తమ బలాబలాలను సరిగా అంచనా వేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. అలాగే తమ జట్టులో రెండు కీలక మార్పులు చేసినట్లు తెలిపాడు.

గత మ్యాచ్‌లో జట్టుకు దూరమైన ట్రెంట్ బౌల్ట్ ఈ మ్యాచ్‌లో తిరిగి జట్టుతో చేరినట్లు శాంసన్ వెల్లడించాడు. అతనితోపాటు మురుగన్ అశ్విన్ స్థానంలో కేఎం ఆసిఫ్ ఆడుతున్నట్లు చెప్పాడు. బౌల్ట్ కోసం కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టినట్లు తెలిపాడు. రూట్ ఒక బౌలింగ్ ఆప్షన్ కూడా అని, అతను ఒక బౌలింగ్ మార్పుగా ఉంటాడని వివరించాడు.
'ఈ ఫార్మాట్ అనే కాదు, ఏ ఫార్మాట్ అయినా సరే. ఎంత బాగా ఆడినా కూడా ఫలితం మనకు అనుకూలంగా వస్తుందన్న గ్యారంటీ లేదు. ఇటీవల మేం ఎదుర్కొన్న ఓటములు మర్చిపోయేవి కావు. అయితే క్రీడాకారులుగా వాటిని పక్కన పెట్టి ముందుకు ఎలా వెళ్లాలో కూడా మాకు తెలుసు' అని చెప్పుకొచ్చాడు.
'వాళ్లకు కావలసిన పిచ్ చేయించుకున్నారు. ఇదొక కొత్త రోజు. మేం ఒక్కో మ్యాచ్‌నే సీరియస్‌గా తీసుకొంటున్నాం. ప్రస్తుతం జట్టులో ఒక్క మార్పు చేశాం. వైభవ్ అరోరా స్థానంలో అనుకూల్ రాయ్ ఆడుతున్నాడు. పిచ్ కొంత డ్రైగా కనిపిస్తోంది. నిన్న మబ్బులు పట్టి ఉండటంతో.. మా టీంలో ఒక స్పిన్నర్, ఒక ఆల్‌రౌండర్‌ను జట్టులో తీసుకున్నాం. దీంతో టీం బ్యాటింగ్ డెప్త్ కూడా పెరిగింది. ప్రస్తుతానికి మంచి స్కోర్ ఏదో అనుకోలేదు. కానీ అనుకున్న దాని కన్నా పది పరుగులు ఎక్కువే చేయాలని అనుకుంటున్నా' అని నితీష్ రాణా చెప్పాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్: జేసన్ రాయ్, రహ్మనుల్లా గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, కేఎం ఆసిఫ్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్