Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RRvsKKR : తిప్పేసిన చాహల్.. రాజస్థాన్ ముందు ఈజీ టార్గెట్!

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అదరగొట్టాడు. కేకేఆర్ గాడిలో పడుతున్నట్లు కనిపించిన ప్రతిసారీ తన సూపర్ బౌలింగ్‌తో ఆ టీం ఆశలకు గండికొట్టాడు. నాలుగు ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతనితోపాటు ట్రెంట్ బౌల్ట్ కూడా రాణించాడు.

కేకేఆర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓపెనర్లు జేసన్ రాయ్ (10), రహ్మనుల్లా గుర్బాజ్ (18) ఇద్దర్నీ ట్రెంట్ బౌల్ట్ అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత చాహల్ తన మాయ స్టార్ట్ చేశాడు. జోరుమీదున్న కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా (22)ను అవుట్ చేశాడు. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన వెంకటేశ్ అయ్యర్ (57)ను కూడా చాహల్ తన బుట్టలో వేసుకున్నాడు.

Yuzvendra Chahal bowled super well

ఆ తర్వాత రింకూ సింగ్ (16), శార్దూల్ ఠాకూర్ (1)ను కూడా చాహల్ అవుట్ చేశాడు. అతని బౌలింగ్ ఆడేందుకు కేకేఆర్ బ్యాటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో అశ్విన్ కూడా తన తొలి రెండు ఓవర్లలో బాగానే బౌలింగ్ వేసినా.. మూడో ఓవర్లో నితీష్ రాణా, వెంకటేశ్ అయ్యర్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు.

చివరి ఓవర్లో కూడా అశ్విన్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మైదానం అంతటా చిరుతల్లా కదిలిన వాళ్లు.. ఎన్నో బౌండరీలను అడ్డుకున్నారు. అలాగే అద్భుతమైన క్యాచులు కూడా అందుకున్నారు. గుర్బాజ్‌ను అవుట్ చేయడానికి సందీప్ శర్మ అందుకున్న క్యాచ్ ఈ మ్యాచ్‌కే హైలైట్.

అలాగే హెట్మెయర్ కూడా కొన్ని సూపర్ క్యాచులు పట్టేశాడు. దీంతో కేకేఆర్ ఏ దశలోనూ భారీ స్కోరు చేసేలా కనిపించలేదు. సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్ చివరి బంతికి కూడా వికెట్ పడింది. దీంతో కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్ ముందు ఈ లక్ష్యం ఏమాత్రం నిలుస్తుందో చూడాలి.

Story first published: Thursday, May 11, 2023, 21:40 [IST]
Other articles published on May 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+