Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs KKR: శుభ్‌మన్‌ 47 ఔట్‌.. కార్తీక్ మరోసారి విఫలం!!

Shubman Gill, Andre Russell falls as KKR in trouble

దుబాయ్: ఐపీఎల్‌ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాట్స్‌మన్‌ తడబడుతున్నారు. ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శుభ్‌మన్‌ గిల్‌ పర్వాలేదనిపించాడు. ఆదుకుంటారనుకున్న నితీశ్‌ రాణా (22), ఆండ్రూ రస్సెల్‌ (24) నిరాశ పరచగా.. కెప్టెన్ దినేశ్‌ కార్తీక్ ‌(1) మరోసారి విఫలమయ్యాడు. దీంతో కోల్‌కతా స్కోర్ బోర్డు వేగం తగ్గింది. రాజస్థాన్‌ జట్టులో ఏకంగా ఏడుగురు బౌలర్లు బౌలింగ్ చేయడం విశేషం. జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీశాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు శుభారంభం దక్కలేదు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ సునీల్‌ నరైన్‌ ఓపెనర్‌గా విఫలమయ్యాడు. జయదేవ్ ఉనద్కత్‌ బౌలింగ్‌లో‌ నరైన్ ‌(15: 14 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌) వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాది తర్వాతి బంతికే బౌల్డ్‌ అయ్యాడు. దీంతో కోల్‌కతా తొలి వికెట్‌ కోల్పోయింది. ఈ సమయంలో యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌కు నితీశ్‌ రాణా జతకలవడంతో స్కోర్ వేగం పెరిగింది. రాణా, గిల్‌ ఆచితూచి ఆడారు.

వేగం పుంజుకునే సమయంలో రాహుల్ తెవాటియా.. రాణాను ఔట్ చేశాడు. 10వ ఓవర్లో రాణా దూకుడుగా ఆడే క్రమంలో వికెట్‌ చేజార్చుకున్నాడు. ఇక అర్ధ శతకం దిశగా సాగుతున్న గిల్ ‌(47 34 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్‌) అనూహ్యంగా పెవిలియన్‌ చేరాడు. జోఫ్రా ఆర్చర్‌ వేసిన 12వ ఓవర్లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కొద్ది సేపటికే దినేష్ కార్తీక్ ఔట్ అయ్యాడు. ఇక హిట్టర్ ఆండ్రూ రస్సెల్‌ మూడు సిక్సులు బాదినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.

17 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇయాన్ మోర్గాన్ (14), ప్యాట్ కమిన్స్ (10) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ క్రీజులో నిలదొక్కుకొని ఆఖర్లో విజృంభించాలని చూస్తున్నారు. రాజస్థాన్‌ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ కేకేఆర్‌ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేస్తున్నారు.

తెల్లవ్యక్తిని ప్రేమించినంత మాత్రాన.. భారతీయ సంప్రదాయానికి వచ్చిన నష్టమేమీలేదు: మాక్సీ ప్రేయసి
https://telugu.mykhel.com/cricket/glenn-maxwell-s-fiancee-vini-raman-slams-man-who-called-the-australian-cricketer-a-troubled-white-gu-030592.html

Story first published: Wednesday, September 30, 2020, 21:42 [IST]
Other articles published on Sep 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+