RR vs KKR: రాయల్స్‌ జోరుకు అడ్డుకట్ట.. కోల్‌కతా ఘన విజయం!!

IPL 2020,RR vs KKR Highlights : Kolkata Defeated Rajasthan By 37 Runs || Oneindia Telugu

దుబాయ్: ఐపీఎల్‌ 2020లో భాగంగా బుధవారం రాత్రి దుబాయ్ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజయం సాధించింది. కోల్‌కతా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో 37 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. దీంతో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న రాయల్స్‌ జోరుకు అడ్డుకట్ట పడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో సంచలన ప్రదర్శన చేసిన రాజస్థాన్‌.. మూడో మ్యాచ్‌లో కోల్‌కతా యువ బౌలర్ల దెబ్బకు దారుణంగా విఫలమైంది. టామ్ కరన్ (54, 36 బంతుల్లో; 2×4, 3×6) హాఫ్ సెంచరీతో పోరాడినా రాయల్స్‌ను గెలిపించలేకపోయాడు. కోల్‌కతాకు రెండో విజయం కాగా, రాజస్తాన్‌కు తొలి ఓటమి.

వికెట్లు టపటపా:

వికెట్లు టపటపా:

కేకేఆర్‌ నిర్దేశించిన 175 పరుగుల టార్గెట్‌లో రాజస్తాన్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ స్టీవ్‌ స్మిత్.. 3 పరుగులకే ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం సంజూ శాంసన్‌ (8) కూడా నిరాశపరిచాడు. జోస్‌ బట్టర్ ‌(21), రాబిన్‌ ఊతప్ప (2)లు స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో రాజస్తాన్‌ కష్టాల్లో పడింది. రియాన్‌ పరాగ్ ‌(1), రాహుల్‌ తెవాటియా (14)లు ఆకట్టులేకపోవడంతో రాజస్తాన్‌ 66 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోవడంతో తేరుకోలేకపోయింది. కోల్‌కతా యువ బౌలర్ల దెబ్బకు రాజస్థాన్‌ విలవిల్లాడింది. వరుస ఓవర్లలో టపటపా వికెట్లు చేజార్చుకుంది.

కరన్‌ మెరుపులు మెరిపించినా:

కరన్‌ మెరుపులు మెరిపించినా:

ఇక జోఫ్రా ఆర్చర్‌ వచ్చీ రావడంతోనే ఒక సిక్స్‌ కొట్టినా.. ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. వరుణ్‌ చక‍్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌ కొట్టే ప్రయత్నంలో నాగర్‌కోటి అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో ఆర‍్చర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ తర్వాత ఏ దశలోనూ రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగలేదు. కాగా టామ్‌ కరన్‌ చివరి వరకూ క్రీజ్‌లో ఉండి మెరుపులు మెరిపించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఓటమి తప్పలేదు. రాజస్తాన్‌ ఆటగాళ్లలో ఎనిమిది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడం విశేషం. కోల్‌కతా బౌలర్లలో శివమ్‌ మావి (2/20), కమ్లేశ్‌ నాగర్‌కోటి (2/13), వరుణ్‌ చక్రవర్తి (2/25) అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని కుప్పకూల్చారు.

శుభ్‌మన్‌ గిల్‌ షో:

శుభ్‌మన్‌ గిల్‌ షో:

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఓపెనర్‌ సునీల్ నరైన్‌ (15: 14 బంతుల్లో; 2×4, 1×6) మరోసారి నిరాశ పరిచాడు. రాబిన్ ఉతప్ప ఇచ్చిన జీవన దానాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మరోవైపు ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (47, 34 బంతుల్లో; 5×4, 1×6) మాత్రం మరోసారి చక్కని ప్రదర్శన కనబరిచాడు. నరైన్‌ ఔటైన తర్వాత నితీశ్‌ రాణా (22: 17 బంతుల్లో; 2×4, 1×6)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అతడితో కలిసి రెండో వికెట్‌కు 46 పరుగులు చేశాడు.

ఆదుకున్న మోర్గాన్‌:

ఆదుకున్న మోర్గాన్‌:

రాహుల్ తెవాతియా వేసిన 10వ ఓవర్‌లో రాణా పెవిలియన్‌కు చేరాడు. కొద్దిసేపటికే గిల్‌ కూడా ఆర్చర్‌కు రిటర్న్క్యా చ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ దినేశ్ కార్తీక్‌ (1), ఆండ్రీ రసెల్ (24: 14 బంతుల్లో; 3×6), ప్యాట్ కమిన్స్‌ (12: 10 బంతుల్లో; 1×4) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఆఖర్లో ఇయాన్ మోర్గాన్‌ (34*, 23 బంతుల్లో; 1×4, 2×6) బ్యాట్‌ ఝుళిపించడంతో కోల్‌కతా 174 పరుగులకు చేరింది. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ రెండు వికెట్లు తీశాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, September 30, 2020, 23:39 [IST]
Other articles published on Sep 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X