Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RRvsDC : మూడు మార్పులతో బరిలో దిగుతున్న వార్నర్ సేన.. పృథ్వీ షా అవుట్!

రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ 2023 మ్యాచ్‌కు అంతా రెడీ అయింది. గువాహటిలోని బర్సాపరా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచాడు. అనుకున్నట్లే ఈ మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ స్థానంలో రావ్‌మెన్ పావెల్‌ను తీసుకున్నట్లు అతను ప్రకటించాడు. ఈ క్రమంలో వార్నర్ ఒక షాకింగ్ నిర్ణయం కూడా తీసకున్నాడు.

తమ జట్టులో మొత్తం మూడు మార్పులు చేసినట్లు వార్నర్ ప్రకటించాడు. పెళ్లి చేసుకోవడానికి ఆస్ట్రేలియా వెళ్లిపోయిన మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. అలాగే గత మ్యాచ్‌లో జిడ్డు బ్యాటింగ్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్‌, పెద్దగా ఆకట్టుకోని అమాన్ ఖాన్‌ను కూడా పక్కన పెట్టినట్లు ప్రకటించాడు. ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న అతను.. తమ ఆడే జట్టులో పృథ్వీ షాకు కూడా చోటు లేదన్నాడు.

warnerprudhvishaw

అయితే అతన్ని సబ్‌స్టిట్యూట్ల జాబితాలో చేర్చాడు. దీంతో ఛేజింగ్‌ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అతన్ని తీసుకుంటాడని నిపుణులు భావిస్తున్నారు. అలాగే వేలి గాయంతో ఇబ్బంది పడుతున్న జోస్ బట్లర్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని వచ్చిన వార్తలపై కూడా టాస్ సమయంలో క్లారిటీ వచ్చింది. తమ జట్టులో జోస్ బట్లర్ ఆడుతున్నట్లు సంజూ శాంసన్ ప్రకటించాడు.

అదే సమయంలో గత రెండు మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోని కేఎం ఆసిఫ్‌ను కూడా సబ్‌స్టిట్యూట్ జాబితాలో చేర్చినట్లు సంజూ తెలిపాడు. అతని స్థానంలో సందీప్ శర్మను జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు. ఐపీఎల్‌లో సందీప్ రికార్డు చాలా బాగుంది. అలాగే పేలవంగా ఆడుతున్న దేవదత్ పడిక్కల్‌ను కూడా పక్కన పెట్టేశారు. అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అదరగొట్టిన ధృవ్ జురెల్‌ను ఆడిస్తున్నట్లు సంజూ వెల్లడించాడు. దీంతో రాజస్థాన్ బ్యాటింగ్ బలం మరింత పెరిగినట్లయింది.

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, జేసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీష్ పాండే, రైలీ రూసో, రావ్‌మెన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఆన్రిచ్ నోర్యీ

Story first published: Saturday, April 8, 2023, 15:46 [IST]
Other articles published on Apr 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+