Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాజస్థాన్‌పై కోహ్లీ ప్రదర్శన పేలవం

RR vs RCB Preview: Virat Kohli not fare record on Rajasthan Royals

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి రాజస్థాన్ రాయల్స్ జట్టుపై రికార్డు మరీ దారుణంగా ఉంది. రాజస్థాన్ జట్టుపై కోహ్లీ పరుగులు చేయలేకపోతున్నాడు. ప్రస్తుతం ఇదే అతన్ని కలవరపెడుతోంది. ఎందుకంటే ఈ రోజు రాత్రి రాజస్థాన్, బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

17 మ్యాచుల్లో 319 పరుగులు:

17 మ్యాచుల్లో 319 పరుగులు:

విరాట్ కోహ్లీ ప్రపంచంలో ఎలాంటి జట్టుపై అయినా అలవోకగా సెంచరీలు చేస్తాడు. కోహ్లీ క్రీజులో ఉంటే.. టాప్ బౌలర్లు కూడా గెలుపుపై ఆశలు వదులుకుంటారు. అలాంటి విరాట్ కోహ్లీ ఐపీఎల్ జట్టు రాజస్థాన్‌పై మాత్రం రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు రాజస్థాన్‌తో ఆడిన 17 మ్యాచుల్లో కింగ్ కోహ్లీ కేవలం 319 పరుగులు మాత్రమే చేశాడు.

మరీ దారుణం:

మరీ దారుణం:

ఈ రోజు మ్యాచ్‌ జరగనున్న సవాయ్‌ మాన్‌సింగ్‌ మైదానంలో అయితే కోహ్లీ ప్రదర్శన మరీ దారుణంగా ఉంది. ఈ మైదానంలో కోహ్లీ 6 మ్యాచులు ఆడగా.. 108 పరుగులు మాత్రమే చేశాడు. చివరి సారిగా 2018లో ఇక్కడ ఆడిన విరాట్‌.. 4 పరుగులు చేసాడు. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో అయినా రాణించి తనపై ఉన్న చెత్త రికార్డును అధిగమిస్తాడో చూడాలి.

 సవాయ్‌ మైదానంలో కోహ్లీ పరుగులు:

సవాయ్‌ మైదానంలో కోహ్లీ పరుగులు:

2008 - 3

2010 - 14

2011 - 39*

2012 - 16

2013 - 32

2018 - 4

Story first published: Tuesday, April 2, 2019, 17:39 [IST]
Other articles published on Apr 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+