For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs PBKS: బట్లర్ స్థానంలో అతనొచ్చాడు- శాంసన్

ఐపీఎల్-2024 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. గౌహతి వేదికగా పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. టాప్-2లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని రాజస్థాన్, లీగ్ దశను విజయంతో ముగించాలని పంజాబ్ పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయిన విషయం తెలిసిందే.

12 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఎనిమిదింట్లో గెలిచి 16 పాయింట్లు సాధించింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. 12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కేవలం నాలుగు విజయాలే సాధించి పాయింట్ల టేబుల్‌లో అట్టడుగన నిలిచింది. ఈ పోరులో రాజస్థాన్‌పై నెగ్గి ఈ సీజన్‌ను విజయంతో ముగించాలని పంజాబ్ భావిస్తోంది.

RR vs PBKS Tom Kohler-Cadmore comes in for Buttler- Sanju Samson

అయితే పాకిస్థాన్ టీ20 సిరీస్, వరల్డ్ కప్ సన్నాహకం కోసం కొందరు ఇంగ్లండ్ ఆటగాళ్లు భారత్‌ను విడిచారు. రాజస్థాన్ స్టార్ ఓపెనర్ బట్లర్, పంజాబ్ కీలక ప్లేయర్ లివింగ్‌స్టోన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. అయితే దక్షిణాఫ్రికా పేసర్ రబాడ కూడా పంజాబ్ జట్టును వీడాడు. దీంతో ఇరు జట్ల కూర్పుపై ఆసక్తి పెరిగింది.

పిచ్ విషయానికొస్తే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. గౌహతిలో గత నాలుగు మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోరు 213. కాగా, టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనంతరం మాట్లాడుతూ ''గౌహతి మాకు రెండో హోమ్ గ్రౌండ్. మేం ఇక్కడ గత రెండు రోజులు సమయాన్ని గడిపాం. మంచు ప్రభావం చూపదని భావించాం. అందుకే మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాం. బట్లర్ స్థానంలో టామ్ కోహ్లర్ జట్టులోకి వచ్చాడు'' అని సంజు శాంసన్ అన్నాడు.

తుది జట్లు
పంజాబ్ కింగ్స్: బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రొసో, శశాంక్ సింగ్, జితేశ్ శర్మ, సామ్ కరన్ (కెప్టెన్), హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, నాథన్ ఎలిస్, అర్షదీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్

రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైస్వాల్, టామ్ కోహ్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, పావెల్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, చాహల్.

Story first published: Wednesday, May 15, 2024, 19:36 [IST]
Other articles published on May 15, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+