Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs PBKS: పోరాడిన పరాగ్.. పంజాబ్‌కు రాజస్థాన్ స్వల్ప లక్ష్యం

సొంతగడ్డపై రియాన్ పరాగ్ (48; 34 బంతుల్లో, 6x4) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో పంజాబ్ కింగ్స్‌కు రాజస్థాన్ రాయల్స్ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. గౌహతి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. స్లో పిచ్‌పై పంజాబ్ బౌలర్లు సామ్ కరన్ (2/24), రాహుల్ చాహర్ (2/26), హర్షల్ పటేల్ (2/28) తలో రెండు వికెట్లతో చెలరేగారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యశస్వీ జైస్వాల్ (4; 4 బంతుల్లో, 1x4) తొలి ఓవర్‌లోనే సామ్ కరన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత పవర్‌ప్లే వరకు మరో వికెట్ కోల్పోకపోయినప్పటికీ రాజస్థాన్ బౌండరీల మోత మోగించలేకపోయింది. 6 ఓవర్లకు 38/1 స్కోరుతో నిలిచింది. బట్లర్ స్థానంలో వచ్చిన టామ్ కోహ్లెర్ (18; 23 బంతుల్లో, 2x4, 1x6) నిదానంగా ఆడటం రాజస్థాన్ పవర్‌ప్లే స్కోరుపై తీవ్ర ప్రభావం చూపించింది.

RR vs PBKS Ryan Parag s Crucial Innings Sets Competitive Target for Punjab Kings

అయితే పవర్ల్ ప్లే ముగిసిన అనంతరం రాజస్థాన్ రాయల్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. సంజు శాంసన్ (18; 15 బంతుల్లో, 3x4)ను నాథన్ ఎలిస్, టామ్‌ను రాహుల్ చాహర్ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (28; 19 బంతుల్లో, 4x3, 1x6)తో కలిసి రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. రియాన్ నిలకడగా ఆడగా, అశ్విన్ అదిరే షాట్లతో స్కోరు వేగాన్ని పెంచాడు. రాహుల్ చాహర్ వేసిన 12వ ఓవర్‌లో యాష్ వరుసగా ఓ సిక్సర్, రెండు ఫోర్లు బాదాడు.

కానీ , ఆ తర్వాతి ఓవర్‌లోనే అశ్విన్ భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. అనంతరం ధ్రువ్ జురెల్ (గోల్డెన్ డకౌట్), పావెల్ (4; 5 బంతుల్లో, 1x4) విఫలమవ్వడంతో 102 పరుగులకే రాజస్థాన్ ఆరు వికెట్లు కోల్పోయింది. మరో ఎండ్‌లో రియాన్ పరాగ్ ఒంటరి పోరాటం కొనసాగించాడు. ఓవర్‌కో బౌండరీ చొప్పున బాదుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. అయితే ఆఖరి ఓవర్ రెండో బంతికి పరాగ్‌ను హర్షల్ బోల్తాకొట్టించాడు.

Story first published: Wednesday, May 15, 2024, 21:39 [IST]
Other articles published on May 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+