For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs PBKS: నేహాల్ వధేరా, శశాంక్ ఊచకోత

RR vs PBKS: జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌కు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో నేహాల్ వధేరా, శశాంక్ సింగ్‌లు అర్థ శతకాలతో అద్భుతంగా రాణించారు. నేహాల్ వధేరా 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 70 పరుగులు చేశాడు. శశాంక్ సింగ్ 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 59 పరుగులు చేశాడు. చివరలో అజ్మతుల్లో ఒమర్జాయ్ 9 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు.

పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 21 పరుగులతో పరవాలేదనిపించారు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో ప్రియాన్ష్ ఆర్య(9), మిచెల్ ఓవెన్(0) విఫలం అయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 2 వికెట్లు పడగొట్టగా.. క్వెనా మఫాక్, రియాన్ పరాగ్, ఆకాష్ మధ్వల్ తలో వికెట్ తీసుకున్నారు.

RR vs PBKS IPL 2025 Nehal Wadhera Shashank Singh Power Punjab to 219 with Explosive Fifties

అరంగేట్రంలోనే విఫలం
ఐపీఎల్ 2025లో చేరడానికి పాకిస్తాన్‌లోని పీఎస్ఎల్‌ను విడిచిపెట్టిన బ్యాటర్ మొదటి మ్యాచ్‌లోనే ఘోరంగా విఫలమయ్యాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టుకు ఆరంభం చాలా దారుణంగా ఉంది. పవర్ ప్లేలోనే ఆతిథ్య జట్టు మూడు పెద్ద వికెట్లను కోల్పోయింది. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మిచెల్ ఓవెన్ పెవిలియన్‌కు తిరిగి వచ్చారు. గ్లెన్ మాక్స్వెల్ స్థానంలో పంజాబ్ తన జట్టులోకి చేర్చుకున్న అదే ఓవెన్ డకౌట్ గా వెనుదిరగడం గమనార్హం. బిగ్ బాష్ లీగ్‌లో ఓవెన్ విస్ఫోటనకరమైన బ్యాటింగ్ చూసిన తర్వాత అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, కనీసం కంగారూ బ్యాట్స్‌మన్ అరంగేట్రంలోనే తుస్సుమనిపించాడు.

ఓవెన్ ఖాతా తెరవలేదు..
రాజస్థాన్ పై జరిగిన మ్యాచ్ లో ప్రియాన్ష్ ఆర్య తన బ్యాట్‌తో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. ప్రియాన్ష్ ను తుషార్ దేశ్‌పాండే కేవలం 9 పరుగులకే ఔట్ చేశాడు. దీని తర్వాత మిచెల్ ఓవెన్ క్రీజులోకి వచ్చాడు. మిచెల్ ఓవెన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. రెండో బంతికి పెద్ద షాట్ ఆడటానికి ప్రయత్నిస్తూ, ఓవెన్ బంతిని గాల్లోకి ఆడాడు. సంజు శాంసన్ దానిని పట్టుకోవడంలో ఎటువంటి తప్పు చేయలేదు.

-

Story first published: Sunday, May 18, 2025, 17:39 [IST]
Other articles published on May 18, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+