Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs PBKS: పాకిస్థాన్ నుంచి ఐపీఎల్‌లోకి.. 2 బంతుల్లోనే తుస్సుమనిపించాడు!

RR vs PBKS: ఐపీఎల్ 2025లో చేరడానికి పాకిస్థాన్‌లోని పీఎస్ఎల్‌ను విడిచిపెట్టిన ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ మిచెల్ ఓవెన్ తన ఐపీఎల్ కెరీర్‌ను పేలవంగా ఆరంభించాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున మిచెల్ ఓవెన్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే మిచెల్ ఓవెన్ దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 2 బంతులు మాత్రమే ఎదుర్కొని ఖాతా తెరవకుండానే మిచెల్ ఓవెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రాజస్థాన్ పేసర్ క్వెనా మఫాకా బౌలింగ్ లో కెప్టెన్ సంజూ శాంసన్ కు క్యాచ్ ఇచ్చి మిచెల్ ఓవెన్ ఔటయ్యాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ స్థానంలో పంజాబ్ కింగ్స్ జట్టులోకి వచ్చిన మిచెల్ ఓవెన్ మరో మ్యాక్సీగా మారిపోయినట్లు అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఐపీఎల్ టోర్నమెంట్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ గాయం కారణంగా మిగతా మ్యాచ్ లకు దూరం కావడంతో మిచెల్ ఓవెన్ ను పంజాబ్ కింగ్స్ జట్టు రూ.3కోట్లకు జట్టులో చేర్చుకుంది. పంజాబ్ జట్టు ఈ యువ ఆటగాడిపై ఎన్నో ఆశలు పెట్టుకోగా.. మిచెల్ ఓవెన్ మాత్రమే తన ఐపీఎల్ అరంగేట్రంలోనే తుస్సుమనిపించాడు. అంతకు ముందు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఇదే తరహాలో ప్రదర్శన కనబరచడం గమనార్హం. ఇప్పుడు మిచెల్ ఓవెన్ కూడా అదే తీరుగా విఫలం కావడంతో మరో మ్యాక్సీ వచ్చాడని కామెంట్లు చేస్తున్నారు.

RR vs PBKS From PSL to IPL Mitchell Owen Flops on Debut with a Golden Duck

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టుకు ఆరంభం చాలా దారుణంగా ఉంది. పవర్ ప్లేలోనే ఆతిథ్య జట్టు మూడు పెద్ద వికెట్లను కోల్పోయింది. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మిచెల్ ఓవెన్ పెవిలియన్‌కు తిరిగి వచ్చారు. గ్లెన్ మాక్స్వెల్ స్థానంలో పంజాబ్ జట్టులోకి వచ్చిన మిచెల్ ఓవెన్ తుస్సుమనిపించాడు. బిగ్ బాష్ లీగ్‌లో ఓవెన్ విస్ఫోటనకరమైన బ్యాటింగ్ చూసిన తర్వాత అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, కనీసం కంగారూ బ్యాట్స్‌మన్ అరంగేట్రం చాలా పేలవంగా ఉంది.

ఖాతా కూడా తెరవలేదు..
రాజస్థాన్ పై జరిగిన మ్యాచ్ లో ప్రియాన్ష్ ఆర్య తన బ్యాట్‌తో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. ప్రియాన్ష్ ను తుషార్ దేశ్‌పాండే కేవలం 9 పరుగులకే ఔట్ చేశాడు. దీని తర్వాత మిచెల్ ఓవెన్ క్రీజులోకి వచ్చాడు. మిచెల్ ఓవెన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. రెండో బంతికి పెద్ద షాట్ ఆడటానికి ప్రయత్నిస్తూ, ఓవెన్ బంతిని గాల్లోకి ఆడాడు. సంజు శాంసన్ దానిని పట్టుకోవడంలో ఎటువంటి తప్పు చేయలేదు.

Story first published: Sunday, May 18, 2025, 18:18 [IST]
Other articles published on May 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+