Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs MI: 'ఒక మ్యాచ్‌ని ఒక్కసారి మాత్రమే ఆడుతాం.. ప్లే ఆఫ్స్‌ గురించి ఏమాత్రం ఆలోచించటం లేదు'

RR vs MI: Rajasthan Royals All-rounder Rahul Tewatia says We Not thinking about IPL 2021 playoffs

షార్జా: తాము ప్లే ఆఫ్స్‌ గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని రాజస్థాన్‌ రాయల్స్ ఆల్‌రౌండర్‌ రాహుల్ తెవాటియా తెలిపాడు. ఒక మ్యాచ్‌ని ఒక్కసారి మాత్రమే ఆడతామన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో లీగ్‌ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. మూడు బెర్తులు ఖరారు కాగా.. మరో స్థానం కోసం రసవత్తర పోరు నడుస్తోంది. ఈ రోజు షార్జా వేదికగా ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇరు జట్లకు ఇది చాలా కీలకమైన మ్యాచ్‌. ఇందులో విజయం సాధించిన జట్టు ప్లే ఆఫ్స్‌ రేసులో ఉంటుంది. ఓడిన జట్టు మాత్రం రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ రసవత్తరంగా సాగే అవకాశముంది.

యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 2021 రెండో దశలో ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు ఇంచుమించు ఒకేలా ఆడుతున్నాయి. రాజస్థాన్‌ ఆడిన 5 మ్యాచ్‌ల్లో మూడు ఓటములు, 2 విజయాలతో కొనసాగుతుండగా.. ముంబై నాలుగు ఓటములు ఒక విజయంతో ప్లే ఆఫ్స్‌ రేసులో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం ఈ రెండు జట్లు 10 పాయింట్లతో సమానంగా కొనసాగుతున్నా.. రన్‌రేట్‌ (-0.453) పరంగా వెనుకంజలోనే ఉన్న ముంబై ఏడో స్థానంలో ఉంది. రాజస్థాన్‌ ఆరో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ జట్టు 10 పాయింట్లతో ఇదో స్థానంలో ఉన్నా.. ఆ జట్టుకు మిగిలివుంది ఒకే ఒక్క మ్యాచ్. ఈ రోజు రాజస్థాన్ గెలిస్తే.. ముంబై, రాజస్థాన్ ఇంటికి వెళ్లాల్సిందే.

ఇప్పటివరకు ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు మొత్తం 25 మ్యాచ్‌ల్లో తలపడగా.. రాజస్థాన్‌ 12, ముంబై 13 మ్యాచ్‌లు గెలుపొందాయి. ఈ మ్యాచ్ జరిగే షార్జా మైదానం చిన్నదే కాబట్టి భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. అయితే చివరి 6 మ్యాచ్‌లలో నమోదైన అత్యధిక స్కోరు 164. షార్జా పిచ్ గతంలో మాదిరిగా లేదు. ప్రస్తుతం 150 కంటే ఎక్కువ పరుగులు చేస్తే.. ఈ వికెట్‌పై గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మ్యాచుకు ఎలాంటి వర్షపు ముప్పు లేదు.

తాజాగా రాహుల్ తెవాటియా మాట్లాడుతూ... 'ఇకపై జరిగే రెండు మ్యాచ్‌లు చాలా కీలకమైనవి. అయితే రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు వెళ్లడం గురించి మేం ఆలోచించడం లేదు. ఒక మ్యాచ్‌ని ఒక్కసారి మాత్రమే ఆడతాం. గత మ్యాచ్‌లో ఆడిన విధంగా.. మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం. మా జట్టు డైరెక్టర్ కుమార సంగక్కర కూడా ఇదే విషయం మాతో చెప్పారు. మా మిడిల్‌ ఆర్డర్‌ తడబడుతోంది. నేను బాధ్యత తీసుకుంటా. నేను అంచనాలకు తగ్గట్టు రాణించడం లేదని నాకు కూడా తెలుసు. రానున్న మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన చేయడానికి కృషిచేస్తా' అని అన్నాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ గురించి స్పందిస్తూ... 'ముంబై మిడిల్‌ ఆర్డర్‌ చాలా బాగుంది. టాప్‌ ఆర్డర్‌ కూడా పటిష్టంగా ఉంది. తెలివిగా ఆడి గెలిచేందుకు ప్రయత్నిస్తాం' అని తెవాటియా పేర్కొన్నాడు.

Story first published: Tuesday, October 5, 2021, 18:02 [IST]
Other articles published on Oct 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+