Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. డికాక్, కృనాల్ ఔట్! రెండు మార్పులతో బరిలోకి రాజస్థాన్!!

RR vs MI playing 11 is out: Ishan Kishan, and James Neesham in and De Kock and Krunal out

షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబై ఇండియన్స్​, రాజస్థాన్​ రాయల్స్​ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ తుది జట్టులో రెండు మార్పులు చేశాడు. స్టార్ ప్లేయర్స్ క్వింటన్ డికాక్, కృనాల్ పాండ్యాల స్థానంలో ఇషాన్ కిషన్, జేమ్స్ నీశమ్ జట్టులోకి వచ్చారు. మరోవైపు రాజస్థాన్ కెప్టెన్ కూడా రెండు మార్పులు చేశాడు. మయాంక్ మార్కండే స్థానంలో శ్రేయాస్ గోపాల్.. ఆకాష్ సింగ్ బదులుగా కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ ఆడనున్నారు.

ఐపీఎల్‌ 2021 ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు ఇకపై ఆడాల్సిన తమ రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సి ఉంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో ఈ రెండు జట్లూ తలపడనుండగా.. ఎవరు గెలుస్తారనే విషయం ఆసక్తి కలిగిస్తోంది. గెలిచిన జట్టు ఒక అడుగు ముందుకేసి.. మరో మ్యాచ్‌ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఓడిన జట్టు మాత్రం నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అయితే రాజస్థాన్‌ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. నాలుగో స్థానంలో ప్లే ఆఫ్స్‌ చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ముంబై మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవడంతో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్‌ రాయల్స్ ఫలితంపైనా ఆధారపడాల్సి ఉంది.

ఇప్పటివరకు ఇరు జట్లు మొత్తం 25 మ్యాచ్‌ల్లో తలపడగా రాజస్థాన్‌ 12, ముంబయి 13 మ్యాచ్‌లు గెలుపొందాయి. ఇక ఈరోజు మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో, ఎవరు ఇంటిముఖం పడుతారో చూడాలి. షార్జా మైదానం చిన్నదే కాబట్టి భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. చివరి 6 మ్యాచ్‌లలో నమోదైన అత్యధిక స్కోరు 164. 150 కంటే ఎక్కువ పరుగులు చేస్తే.. ఈ వికెట్‌పై గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఓటీటీలో కూడా ఈ మ్యాచ్‌ను చూడాలనుకునే ఫాన్స్.. హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.

తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్: ఎవిన్‌ లూయిస్‌, యశస్వీ జైస్వాల్‌, సంజూ శాంసన్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), శివమ్‌ దూబె, గ్లెన్‌ ఫిలిప్స్‌, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్ తెవాటియా, శ్రేయస్‌ గోపాల్‌, కుల్దీప్ యాదవ్‌, చేతన్‌ సకారియా, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌.

ముంబై ఇండియన్స్​: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్), సూర్యకుమార్ యాదవ్‌, సౌరభ్‌ తివారి, హార్దిక్ పాండ్య, జేమ్స్‌ నీషమ్‌, కీరన్‌ పొలార్డ్‌, నాథన్ కౌల్టర్ నైల్, జయంత్ యాదవ్‌, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌.

Story first published: Tuesday, October 5, 2021, 19:24 [IST]
Other articles published on Oct 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+