Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs MI: హాఫ్ సెంచరీతో చెలరేగిన ఇషాన్‌ కిషన్‌.. రాజస్థాన్‌పై ముంబై ఘన విజయం! ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం!!

RR vs MI: Ishan Kishan hits fifty as Mumbai Indians chase 91 runs in just 8.2 overs

షార్జా: ప్లే ఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. షార్జాలో రాజస్థాన్‌ రాయల్స్‌ని ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి.. ఘన విజయాన్ని అందుకుంది. రాజస్థాన్‌ నిర్దేశించిన 91 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని 8.2 ఓవర్లలోనే ముంబై ఛేదించింది. హార్డ్ హిట్టర్ ఇషాన్‌ కిషన్‌ (50: 25 బంతుల్లో 5x4, 3x6) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ త్వరగానే ఔటయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో చేతన్‌ సకారియా, ముస్తాఫిజుర్‌ రహ్మాన్ తలో వికెట్‌ తీశారు. ఈ విజయంతో ముంబై 12 పాయింట్లతో పట్టికలో ఇదో స్థానానికి చేరింది. అయితే ముంబైకి మిగిలిన ఒక మ్యాచ్ గెలిచినా.. కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంపై ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ ఆధారపడి ఉన్నాయి.

 ఇషాన్‌ కిషన్‌ మెరుపులు:

ఇషాన్‌ కిషన్‌ మెరుపులు:

స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ భారీ షాట్లు ఆడడమే లక్ష్యంగా వచ్చాడు. 13 బంతుల్లోనే ఓ ఫోర్, రెండు సిక్సులతో 22 పరుగులు చేశాడు. అయితే నాలుగో ఓవర్ రెండో బంతికి చేతన్‌ సకారియా బౌలింగ్‌లో రోహిత్ ఔట్ అయ్యాడు. అనంతరం ఇషాన్‌ కిషన్‌ రెచ్చిపోయాడు. బౌండరీలు బాదుతూ ముంబై స్కోర్ బోర్డునుపరుగులు పెట్టించాడు. మరోవైపు సూర్యకుమార్‌ యాదవ్‌ (13) అతడికి అండగా నిలిచాడు. మూడు ఫోర్లు బాదినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. హార్దిక్ పాండ్యా అండతో ఇషాన్‌ ముంబైని విజయతీరాలకు చేర్చాడు. తొమ్మిదో ఓవర్ రెండో బంతికి ఫోర్ బాదిన ఇషాన్.. జట్టుకు విజయం అందించడమే కాకుండా హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

 జైస్వాల్‌ వెనుతిరగడంతో:

జైస్వాల్‌ వెనుతిరగడంతో:

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగి రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులకే పరిమితమైంది. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలించడంతో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అయితే తొలి ఇన్నింగ్స్‌ జరిగిన తీరు చూస్తే రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపించకమానదు. ముంబై బౌలర్ల దాటికి రాజస్థాన్‌ బ్యాటర్లు విలవిలలాడారు. రాజస్థాన్ బ్యాటర్లు క్రీజులోకి రావడం, వెళ్లడం పరిపాటుగా మారిపోయింది. రాయల్స్‌ ఓపెనర్స్‌ లూయిస్‌ (24), జైస్వాల్‌ (12) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే నాథన్ కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో జైస్వాల్‌ వెనుతిరగడంతో రాజస్థాన్‌ జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. ఆ వెంటనే లూయిస్‌ అవుట్‌ అయ్యాడు. ఇలా వరుస వికెట్లు కోల్పోయి రాజస్థాన్‌ తీవ్ర కష్టాల్లోకి కూరుకుపోయింది.

 విఫలమయిన శాంసన్‌, మిల్లర్:

విఫలమయిన శాంసన్‌, మిల్లర్:

కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (3), శివమ్‌ దూబె (3), గ్లెన్ ఫిలిప్స్‌ (4) విఫలమయ్యారు. ఒకానొక సమయంలో రాజస్థాన్‌ 50 పరుగులకు 5 వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత కాస్త మ్యాచ్‌ గాడిన పడుతుందనుకునే సమయంలో ముంబై బౌలర్ల దాటికి రాజస్థాన్‌ బ్యాటర్లు ఎవరూ కనీస ప్రదర్శన ఇవ్వలేదు. డేవిడ్‌ మిల్లర్‌ (15), రాహుల్ తెవాటియా (12) జోడి నిలకడగా ఆడుతూ క్రీజులో కుదురుకుంటున్న సమయంలో జిమ్మీ నీషమ్‌ ఈ జోడిని విడగొట్టాడు. 15వ ఓవర్ చివరి బంతికి రాహుల్ తెవాటియా కీపర్‌కి చిక్కాడు. కొద్దిసేపటికే మిల్లర్ కూడా పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ చివరలో వచ్చిన శ్రేయస్ గోపాల్ (0), చేతన్‌ సకారియా (6) రాణించలేకపోయారు. ముస్తాఫిజుర్‌ రహ్మాన్ (8) నాటౌట్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు ఇదే అత్యల్ప స్కోర్‌. ముంబై బౌలర్లలో కౌల్టర్ నైల్ 4, నీషమ్​ మూడు వికెట్లు పడగొట్టారు. బుమ్రా 2 వికెట్లు తీశాడు.

Story first published: Tuesday, October 5, 2021, 23:19 [IST]
Other articles published on Oct 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+