
రాజస్థాన్ బ్యాటర్లు వీళ్లే
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టీంలో ఒక మార్పు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంతగా రాణించలేకపోతున్నా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను తప్పించే అవకాశాలు ఉన్నాయి. అతని స్థానంలో కివీస్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్‌ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు బట్లర్‌తో కలిసి దేవదత్ పడిక్కల్ రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. ఇక మూడో స్థానంలో కెప్టెన్ సంజూ శాంసన్, నాల్గో స్థానంలో షిమ్రాన్ హెట్‌మేయర్, ఐదో స్థానంలో రియన్ పరాగ్, ఆర్ స్థానంలో ఆల్ రౌండర్ జిమ్మి నీషమ్ బ్యాటింగ్ చేయనున్నారు.

బౌలర్లు వీళ్లే
ఇక స్పిన్నర్లుగా రవి చంద్రన్ అశ్విన్, యజుర్వేంద్ర చాహల్ ఆడనున్నారు. అయితే గత మ్యాచ్‌లో కీలక సమయంలో ధారాళంగా పరుగులిచ్చిన అశ్విన్ నుంచి ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ మేనేజ్‌మెంట్ మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. ఇక పేస్ కోటాలో ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్ బరిలోకి దిగనున్నారు.

లక్నో బ్యాటర్లు వీళ్లే
ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. గత మ్యాచ్‌కు దూరమైన మనీష్ పాండే ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. దీంతో గత మ్యాచ్‌లో మనీష్ పాండే స్థానంలో జట్టులోకి వచ్చిన కృష్ణప్ప గౌతం ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఇక లక్నో ఇన్నింగ్స్‌ను క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ ప్రారంభించనున్నారు. మూడో స్థానంలో మనీష్ పాండే బ్యాటింగ్‌కు రానుండగా.. నాల్గో స్థానంలో ఎవిన్ లూయిస్ బ్యాటింగ్ చేయనున్నాడు. ఐదో స్థానంలో దీపక్ హుడా, ఆరో స్థానంలో ఆయుష్ బదోని బ్యాటింగ్ చేయనున్నారు.

ఆల్ రౌండర్ల స్థానాలు ఇవే
ఇక ఏడో స్థానంలో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, ఎనిమిదో స్థానంలో మరో ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ బ్యాటింగ్ చేయనున్నారు. ఇక బౌలర్లుగా రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ఆండ్రూ టై ఆడనున్నారు.

తుది జట్లు (అంచనా)
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్/దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, జిమ్మీ నీషమ్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.


Click it and Unblock the Notifications












