Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR VS LSG: రాజస్థాన్ కొంపముంచిన ఆవేశ్ ఖాన్ - గెలిచే మ్యాచులో ఓటమి!

RR VS LSG: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ కు మరోసారి దురదృష్టం వెంటాడింది. ఆఖరి ఓవర్ లో దోబూచులాడిన విజయం చివరికి లక్నో సూపర్ జెయింట్స్ ను వరించింది. 2 పరుగులు తేడాతో గెలిచింది. ఆఖరి ఓవర్ లో రాజస్థాన్ విజయానికి 9 పరుగులు అవసరం అవ్వగా, ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 6 పరుగులే ఇచ్చి హెట్మెయర్ (12) ను ఔట్ చేసి.. తమ జట్టుకు విజయాన్ని అందించాడు. కాగా, 8 మ్యాచుల్లో రాజస్థాన్ కు ఇది 8వ ఓటమి, పాయింట్ల పట్టికలో 8 స్థానంలో నిలిచింది. లక్నోకు ఇది ఐదో విజయం కాగా, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.

181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఛేదనలో రాజస్థాన్ కు మంచి శుభారంభం దక్కింది. 14 ఏళ్ల టీనేజర్ వైభవ్ సూర్యవంశీ (20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 34 పరుగులు) తన అరంగేట్ర మ్యాచులోనే గర్జించాడు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 74 పరుగులు) చేశాడు. వీరిద్దరు కలిసి తొలి వికెట్ కు 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మార్క్ క్రమ్ బౌలింగ్ లో 8.4 ఓవర్ వద్ద వికెట్ కీపర్ పంత్ చేతిలో వైభవ్ స్టంపౌట్ అయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన నితీశ్ రాణా (8) విఫలమయ్యాడు. రెండో వికెట్ గా వెనుదిరిగాడు. శార్దూల్ బౌలింగ్ లో 9.6 ఓవర్ దగ్గర ఆవేశ్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం మూడో వికెట్ గా యశస్వి జైశ్వాల్ పెవిలియన్ చేరగా.. నాలుగో వికెట్ గా రియాన్ పరాగ్ (39) వెనుదిరిగాడు. సిమ్రాన్ హెట్మెయర్ (12) నిరాశపరిచాడు. లక్నో బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 3 వికెట్లతో మెరిశాడు. శార్దూల్ ఠాకూర్,మారక్రమ్ వికెట్ దక్కించుకున్నారు.

RR VS LSG IPL 2025 Lucknow Super Giants won match by 2 runs against Rajasthan Royals

అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ లో ఓపెనర్ ఐదెన్ మార్‌క్రమ్ (45 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఆయుష్ బదోని (34 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీలో అదరగొట్టారు. ఇక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 30*;) నాలుగు సిక్స్‌లు బాది స్కోరును 180కి చేర్చాడు. ఈ క్రమంలో మార్‌క్రమ్, బదోని జోడీ నాలుగో వికెట్‌కు 76 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మిచెల్ మార్ష్‌ (4), నికోలస్ పూరన్ (11), రిషభ్‌ పంత్ (3) ఫెయిల్ విఫలమయ్యారు. రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్లలో వానిందు హసరంగ 2, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

Story first published: Saturday, April 19, 2025, 23:30 [IST]
Other articles published on Apr 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+