For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR VS LSG: ఆఖరి ఓవర్లో విధ్వంసం - స్టేడియం చెవులకు చిల్లు!

RR VS LSG: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరుగుతోన్న మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో ఇన్నింగ్స్ ను ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.

చివరి 10 బంతుల్లోనే..
అయితే ఈ మ్యాచులో 19 ఓవర్లు ఒకెత్తైతే.. 20 ఓవర్ మరొక ఎత్తు. ఆఖరి ఓవర్లో అద్భుతమే జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఓవర్ లోనే ఏకంగా 27 పరుగులు వచ్చాయి. అబ్దుల్ సమాద్ చివరి 10 బంతుల్లో 4 సిక్సుల సాయంతో 30 అజేయ పరుగులు చేశాడు. అది కూడా 300 స్ట్రైక్ రేటుతో. దీంతో స్కోరు 180కి చేరింది. ఇతడు ఆడిన్నంత సేపు స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది.

RR VS LSG IPL 2025 Abdul smashed 30 runs helps Lucknow super giants scored 180 runs

ఆ ఇద్దరు కీలక భాగస్వామ్యం..
అబ్దుల్ కన్నా ముందు అబ్దుల్ మారక్రమ్ 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 66 రన్స్ సాధించాడు. మిడిల్ ఓవర్లలో ఆయుష్ బదోని 34 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 50 హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో మార్‌క్రమ్, బదోని జోడీ నాలుగో వికెట్‌కు 76 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. మార్‌క్రమ్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బదోనీ.. 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని.. తర్వాత బంతికే ఔటయ్యాడు. మార్ష్ (4), కెప్టెన్ రిషభ్ పంత్ (3) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ రెండు, తుషార్ దేశ్ పాండే, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ తలో వికెట్ తీశారు.

Story first published: Saturday, April 19, 2025, 21:43 [IST]
Other articles published on Apr 19, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+