Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR VS LSG: సరికొత్త చరిత్ర.. 14 ఏళ్ల బుడతడు అరంగేట్రం

RR vs LSG: ఐపీఎల్ 2025లో భాగంగా 36వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జైపూర్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ జట్టు ఈ సీజన్‌లో ఇప్పటివరకు మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ఆ జట్టు 7 మ్యాచ్‌లు ఆడి వాటిలో 2 మాత్రమే గెలిచింది. 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరోవైపు రిషబ్ పంత్ కెప్టెన్సీలో లక్నో జట్టు బాగా ఆడుతోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

అతిపిన్న వయస్కుడు అరంగేట్రం
ఈ మ్యాచ్ కు సంజు శాంసన్ దూరం కాగా.. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తున్నాడు. అతిపిన్న వయస్సులో ఐపీఎల్ ఆడుతున్న ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. సంజు శాంసన్ గత మ్యాచ్ లో గాయం కారణంగా నేటి మ్యాచ్ లో ఆడటం లేదు. అతడి స్థానంలో రియాన్ పరాగ్ ఈ రోజు జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

RR vs LSG 14-Year-Old Vaibhav Suryavanshi Makes Historic IPL Debut

తుది జట్లు ఇవే..

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్‌క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్ , కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్

లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ సబ్స్: ఆయుష్ బడోని, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, రియాన్ పరాగ్ (కెప్టెన్), నితీష్ రాణా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే

రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్స్: వైభవ్ సూర్యవంశీ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, కునాల్ సింగ్ రాథోడ్

Story first published: Saturday, April 19, 2025, 19:33 [IST]
Other articles published on Apr 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+