RR vs KXIP: హమ్మయ్యా.. ఒక బంతికి సిక్స్ కొట్టనందుకు ధన్యవాదాలు తెవాటియా: యువరాజ్

IPL 2020 : Yuvraj Singh Reaction To Rahul Tewatia 5 Sixes In An Over | RR Vs KXIP

ముంబై: ఆదివారం షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్‌ 6 వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో టోర్నీ చరిత్రలోనే రాజస్థాన్ అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి కొత్త రికార్డు నెలకొల్పింది. తన పేరిటే ఉన్న రికార్డును తిరగరాసుకుంది. ఇంతకుముందు 2008లో డెక్కన్‌ ఛార్జర్స్‌పై 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రాయల్స్‌.. ఇప్పుడు 224 పరుగుల లక్ష్యాన్ని ఊదేసింది. సంజూ శాంసన్‌ (85; 42 బంతుల్లో 4x4, 7x6), స్టీవ్‌ స్మిత్ ‌(50; 27 బంతుల్లో 7x4, 2x6), రాహుల్‌ తెవాటియా (53; 31 బంతుల్లో 7x6) విజయంలో కీలక పాత్ర పోషించారు.

 9 ఓవర్లకే 100 పరుగులు:

9 ఓవర్లకే 100 పరుగులు:

224 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ దూకుడుగా ఆడింది. స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ పంజాబ్‌ బౌలర్లపై ఎదురుదాడి చేసి ఓవర్‌కు పది పరుగుల చొప్పున రాబట్టారు. స్మిత్ బౌండరీలు బాధగా.. శాంసన్ సిక్సులే లక్ష్యంగా ఆడాడు. దీంతో రాజస్థాన్‌ 9 ఓవర్లకే 100 పరుగులు చేరింది. అయితే జేమ్స్ నీషమ్‌ వేసిన అదే ఓవర్‌ చివరి బంతికి అప్పుడే అర్ధ శతకం సాధించిన స్మిత్‌.. భారీషాట్‌ ఆడబోయి మొహమ్మద్ షమీ చేతికి చిక్కాడు. దీంతో రాజస్థాన్‌ కీలక సమయంలో ప్రధాన వికెట్‌ కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.

ఒకే ఓవర్‌లో 5 సిక్సులు:

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రాహుల్‌ తెవాటియా తొలుత పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. ఎదుర్కొన్న తొలి 19 బంతుల్లో 8 పరుగులే చేశాడు. ఇక పరిస్థితి చేయి దాటిపోతున్న వేళ శాంసన్ చెలరేగాడు. ఈ క్రమంలోనే అతడు సెంచరీకి చేరువైన సమయంలో షమీ వేసిన 17వ ఓవర్‌ తొలి బంతికి భారీ షాట్‌ ఆడి ఔటయ్యాడు. దీంతో పంజాబ్‌ గెలుపు ఖాయమని అంతా భావించారు. రాజస్థాన్‌ విజయానికి 3 ఓవర్లలో 51 పరుగులు చేయాల్సిన స్థితిలో తెవాటియా అనూహ్యంగా చెలరేగిపోయాడు. అప్పటివరకు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడిన తెవాటియా.. షెల్డన్‌ కాట్రెల్‌ వేసిన 18వ ఓవర్‌లో మొత్తం 5 సిక్సులు బాది అందరిని ఆశ్చర్యపరిచాడు. దీంతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది.

 సిక్స్ కొట్టనందుకు ధన్యవాదాలు:

సిక్స్ కొట్టనందుకు ధన్యవాదాలు:

బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్, లాంగ్ ఆఫ్, మిడ్ వికెట్ మీదుగా రాహుల్ తెవాటియా అద్భుతంగా సిక్సులు బాదాడు. మొదటి 19 బంతుల్లో 8 రన్స్ చేసిన తెవాటియా.. చివరి 12 బంతుల్లో 45 రన్స్ చేసి విధ్వంసం సృష్టించాడు. దీంతో 18 బంతుల్లో 51 పరుగులు చేయడం కష్టం అనుకుంటే.. రాజస్థాన్ 15 బంతుల్లోనే లక్ష్యాన్ని చేధించింది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తెవాటియాపై క్రికెట్ మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్ కాస్త బిన్నంగా స్పందించాడు. 'మిస్టర్ రాహుల్ తెవాటియా.. ఒక బంతిని సిక్స్ కొట్టకుండా వదిలేసినందుకు ధన్యవాదాలు. అద్భుతమైన విజయం సాధించిన రాజస్థాన్ జట్టుకు అభినందనలు. మయాంక్ అగర్వాల్, సంజూ శాంసన్ గొప్ప ఇన్నింగ్స్ ఆడారు' అని యువీ ట్వీట్ చేశాడు.

ఆరు బంతుల్లో ఆరు సిక్సులు:

ఆరు బంతుల్లో ఆరు సిక్సులు:

దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు యువరాజ్ సింగ్ బాదిన విషయం తెలిసిందే. ఆండ్రూ ఫ్లింటాప్‌ అనవసరంగా యువీని రెచ్చగొట్టడంతో.. బ్రాడ్‌ వేసిన 19వ ఓవర్‌లో యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు సాధించడంతో పాటు 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు రాహుల్ తెవాటియా ఒకే ఓవర్లో ఐదు సిక్సులు బాదడంతో యువీ సరదాగా ట్వీట్ చేశాడు.

RR vs KXIP: పూరన్ నువ్ తోపు.. నా జీవితంలో చూసిన బెస్ట్ సేవ్ ఇదే: సచిన్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, September 28, 2020, 9:00 [IST]
Other articles published on Sep 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X