For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs KXIP: 'సంజు శాంసనే తర్వాతి ధోనీ' అన్న కాంగ్రెస్‌ ఎంపీ.. కాదంటున్న బీజేపీ ఎంపీ!!

RR vs KXIP: Shashi Tharoor Calls Sanju Samson Next MS Dhoni, Gautam Gambhir Disagrees
IPL 2020 : Sanju Samson Is Not Next Dhoni,Gambhir Slams Shashi Tharoor On Comparison | RR Vs KXIP

ఢిల్లీ: ఆదివారం షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ ‌ 6 వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. కేరళ యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ (85; 42 బంతుల్లో 4x4, 7x6), కెప్టెన్ స్టీవ్‌ స్మిత్ ‌(50; 27 బంతుల్లో 7x4, 2x6), రాహుల్‌ తెవాటియా (53; 31 బంతుల్లో 7x6) రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరలో తెవాటియా సునామీ సృష్టించినా.. ఆదిలోనే శాంసన్‌ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. షార్జాలో సిక్సులు వర్షం కురిపిస్తూ.. ఐపీఎల్ 2020లో వరుసగా రెండో అర్ధ శతకం బాదాడు.

రాయల్స్ చేదించిందంటే

రాయల్స్ చేదించిందంటే

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్య ఛేదనను రాజస్థాన్ రాయల్స్ చేదించిందంటే.. అదంతా సంజూ శాంసన్ మాయే. కీలక సమయంలో బ్యాట్ జులిపించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఐపీఎల్ 2020లో ఆడిన రెండు మ్యాచులలో సంజు 159 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 16 సిక్సర్లు ఉండగా.. కేవలం 5 బౌండరీలు మాత్రమే ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇన్ని సిక్సర్లు ఇప్పటి వరకు ఎవరూ కొట్టలేదు. అంతేకాదు పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. పంజాబ్‌పై సంజూ చెలరేగిన ఆట తీరుపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, రాజకీయ నాయుకులు ప్రసంశలు కురిపిస్తున్నారు.

తర్వాతి ధోనీ అవుతాడు

తర్వాతి ధోనీ అవుతాడు

సంజూ శాంసన్‌ను కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అభినందించారు. భారత క్రికెట్లో తర్వాతి ఎంఎస్ ధోనీ అవుతాడని సంజూకి ఎప్పుడో చెప్పానని ట్వీట్‌ చేశారు. 'రాజస్థాన్‌ జట్టుకు ఇది తిరుగులేని విజయం. దశాబ్దకాలంగా సంజు శాంసన్‌ నాకు తెలుసు. ఏదో ఒకరోజు తర్వాతి ధోనీగా అవతరిస్తావని 14 ఏళ్లప్పుడే అతడితో అన్నాను. ఆ రోజు ఆసన్నమైంది. లీగ్‌లో రెండు అద్భుతమైన హాఫ్ సెంచరీల తర్వాత ఓ ప్రపంచస్థాయి ఆటగాడు వచ్చాడు. ఈ విషయం అందరికీ తెలుసు' అని శశిథరూర్‌ ట్వీట్లో పేర్కొన్నారు.

మరొకరిలా అవ్వాల్సిన అవసరం సంజూకు లేదు

మరొకరిలా అవ్వాల్సిన అవసరం సంజూకు లేదు

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్ అభిప్రాయంను బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ అంగీకరించలేదు. 'మరొకరిలా అవ్వాల్సిన అవసరం సంజూ శాంసన్‌కు లేదు. అతనెప్పుడూ భారత క్రికెట్లో సంజూ శాంసన్‌గానే ఉండాలి' అని గంభీర్‌ ట్వీట్ చేశారు. ఎంఎస్ ధోనీపై సమయం వచ్చినప్పుడల్లా గంభీర్‌ ఫైర్ అవుతాడనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి సెటైర్లు వేశారు.

ధోనీ వారసుడు కాదు

ధోనీ వారసుడు కాదు

శశిథరూర్ ట్వీట్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కూడా స్పందించారు. 'సంజూ శాంసన్‌.. ధోనీ వారసుడు కాదు. అతడు ఎప్పటికీ శాంసనే.. ఒకే ఒక్కడు. సంజూ 2015 నుంచి అన్ని ఫార్మాట్లలోనూ రెగ్యులర్‌గా ఆడాల్సింది. అతడిని ఎవరితో పోల్చొద్దు. సంజూకి సరైన అవకాశాలు ఇస్తే.. భారత్ తరఫున కూడా ఇలాగే ఆడేవాడు. ప్రపంచకప్‌‌లను గెలిచేవాడు. కానీ అలా జరగలేదు. ఈ రెండు ఇన్నింగ్స్‌లోనే కాదు.. భవిష్యత్తులోనూ ఇలాగే ఆడతాడు. ఎన్నో రికార్డులు బద్దలు కొడతాడు. సంజూని ఎవరితోనూ పోల్చొద్దు. అతడు మన అద్భుత దేశం నుంచి వచ్చిన మళయాళీ ఆటగాడు. అతడు ఇంకా అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంది' అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.

మరో అవకాశం కోసం నాలుగేళ్లు

మరో అవకాశం కోసం నాలుగేళ్లు

ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో పరుగుల మోత మోగించే సంజూ శాంసన్‌కు దురదృష్టవశాత్తు అంతర్జాతీయ క్రికెట్‌లో రావాల్సిన అవకాశాలు రాలేదు. ఇక రాక రాక వచ్చిన అవకాశాల్లో అతను నిరూపించుకోలేకపోయాడు. 2015 జింబాబ్వేతో జరిగిన టీ20 ద్వారా భారత జట్టులోకి వచ్చిన శాంసన్​.. మరో అవకాశం కోసం నాలుగేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. గతేడాది బంగ్లాదేశ్​తో టీ20 సిరీస్​కు ఎంపికైనా.. తుది జట్టులో చోటు దక్కలేదు. బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న శాంసన్.. వరుసగా 8, 2 పరుగులు చేశాడు.

IPL 2020: 'కోహ్లీకి అందమైన సతీమణి అనుష్క.. మేమెందుకు ఆమెను విమర్శిస్తాం'

Story first published: Monday, September 28, 2020, 11:53 [IST]
Other articles published on Sep 28, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+