RR vs KXIP: పూరన్ నువ్ తోపు.. నా జీవితంలో చూసిన బెస్ట్ సేవ్ ఇదే: సచిన్

షార్జా: ఆదివారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మయాంక్‌ అగర్వాల్‌ (50 బంతుల్లో 106; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీకి లోకేశ్‌ రాహుల్‌ (54 బంతుల్లో 69; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) నిలకడైన ఇన్నింగ్స్‌ తోడవడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 85; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రాహుల్‌ తెవాటియా (31 బంతు ల్లో 53; 7 సిక్సర్లు), స్టీవ్‌ స్మిత్‌ (27 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో రాజస్థాన్‌ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసింది.

పూరన్‌ పక్షిలా:

పూరన్‌ పక్షిలా:

ఈ మ్యాచులో కింగ్స్ లెవన్ పంజాబ్ బ్యాట్స్‌మన్‌ నికోలస్ పూరన్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. క్రికెట్ చరిత్రలోనే ది బెస్ట్ అనే రీతిలో బౌండరీ లైన్ దగ్గర బంతిని ఆపాడు. స్పిన్నర్ మురుగన్ అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో సంజూ శాంసన్ డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఆ షాట్ చూసిన అందరూ సిక్స్ వెళ్లడం ఖాయం అనుకున్నారు. బౌండరీకి కొంత వెలుపల బంతి పడుతుండగా.. పూరన్ ఊహించని రీతిలో బౌండరీ లైన్ వెలుపలకు దూకాడు. బౌండరీ లైన్‌ను తాకకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ.. బంతిని పట్టుకున్నాడు.

కోచ్‌గా గర్వంగా ఉంది:

బంతిని అద్భుతంగా పట్టుకున్న నికోలస్ పూరన్.. నేలను తాకే ముందే బాల్‌ను మైదానం లోపలికి విసిరేశాడు. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. పూరన్ అద్భుత ఫీల్డింగ్ చేయడంతో సిక్స్ బదులు రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఇది చూసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టాడు. ఆపై 'క్రికెట్ దిగ్గజం సచిన్ చెప్పినట్టు.. ఇది బెస్ట్ సేవ్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పంజాబ్ ఫీల్డర్‌లను అతడు ప్రేరేపించాడు. నేను ఇప్పటివరకు చూసిన బెస్ట్ ఫీల్డింగ్. కోచ్‌గా గర్వంగా ఉంది' అని ‌జాంటీ ట్వీట్ చేశాడు. పూరన్‌ పక్షిలా ఎగరడం చూసి అభిమానులు అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పూరన్ చేసిన అద్భుత ఫీల్డింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అభిమానులు, మాజీ క్రికెటర్లు తమదైన శైలిలో ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.

బెస్ట్ సేవ్ ఇదే:

బెస్ట్ సేవ్ ఇదే:

నికోలస్ పూరన్ చేసిన ఫీల్డింగ్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్పందించాడు. 'నా జీవితంలో చూసిన బెస్ట్ సేవ్ ఇదే. నమ్మశక్యం కావడం లేదు' అని ట్వీట్ చేశాడు. 'పూరన్ ఫీల్డింగ్ అద్భుతం. పరుగులు ఆపే క్రమంలో.. ఇంతటి గొప్ప ఫీల్డింగ్‌ను ఇంత వరకూ ఎప్పుడూ చూడలేదు. మళ్లీ ప్లే చేయండి' అని కామెంటేటర్ హర్షా భోగ్లే పేర్కొన్నాడు. 'ఇది నా జీవితంలో చూసిన ఉత్తమ ఫీల్డింగ్' అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేశాడు. 'నికోలస్ పూరన్ అద్భుత ఫీల్డింగ్. గతంలో ఎప్పుడైనా ఇలా చూసారా?' అని హాట్‌స్టార్ ట్వీట్ చేసింది. 'క్రికెట్, జీవితంలో నిమిషాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి' అని వీరేందర్ సెహ్వాగ్ ట్వీటాడు.

కొంపముంచిన కాట్రెల్‌:

కొంపముంచిన కాట్రెల్‌:

లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ విజృంభించింది. బట్లర్‌ (4) విఫలమైనా.. స్మిత్‌తో కలిసి శాంసన్‌ దుమ్మురేపాడు. ఈ జోడీ ధాటికి పవర్‌ప్లే ముగిసే సరికి రాయల్స్‌ 69/1తో నిలిచింది. 26 బంతుల్లో అర్ధశతకం చేసిన స్మిత్..‌ ఆ మరుసటి బంతికి ఔటయ్యాడు. సిక్సర్లతో విజృంభించిన శాంసన్‌ జట్టును విజయానికి చేరువ చేయగా.. ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డ తెవాటియా ఆఖర్లో భారీ షాట్లతో లీగ్‌లో రికార్డు లక్ష్యఛేదనలో భాగమయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్‌ స్కోరు 173/3. విజయానికి 21 బంతుల్లో 51 పరుగులు కావాల్సిన దశలో కాట్రెల్‌ కొంపముంచాడు. తెవాటియా ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది రాజస్థాన్‌ హీరోగా మారాడు.

RR vs KXIP: ఒకే ఓవర్లో ఐదు సిక్సులు.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు ఛేదించిన రాజస్థాన్!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, September 28, 2020, 8:06 [IST]
Other articles published on Sep 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X