Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs KXIP: మయాంక్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌.. 45 బంతుల్లోనే సెంచరీ.. రెండో భారత ఆటగాడిగా రికార్డు!!

RR vs KXIP: Mayank Agarwal 106 keeps KXIP on track for 200

షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. లోకేశ్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు ఫోర్లు, సిక్సులు బాదుతూ పరుగుల మోత మోగిస్తున్నారు. ముఖ్యంగా మయాంక్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుతో జరిగిన గత మ్యాచ్‌లో 89 పరుగులు సాధించిన మయాంక్‌.. మళ్లీ విరుచుకుపడ్డాడు. 45 బంతుల్లోనే సెంచరీ సాధించి బ్యాటింగ్‌ పవర్‌ మరోసారి చూపెట్టాడు. మొత్తంగా 50 బంతుల్లో 106 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

26 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ:

26 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ:

రాజస్తాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.. ముందుగా కింగ్స్‌ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను రాహుల్‌, మయాంక్‌లు ఆరంభించారు. వీరిద్దరూ వచ్చీ రావడంతోనే రాయల్స్‌కు చుక్కలు చూపించారు. ఏ బౌలర్‌ను విడిచిపెట్టకుండా మెరుపులు మెరిపించారు. ఈ క్రమంలోనే మయాంక్ 26 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు.

వేగవంతమైన సెంచరీ:

వేగవంతమైన సెంచరీ:

సూపర్‌ ఫామ్‌లో ఉన్న మయాంక్ అగర్వాల్ హాఫ్‌సెంచరీ అనంతరం కూడా‌ వీరవిహారం చేశాడు. దీంతో 45 బంతుల్లోనే శతకం అందుకున్నాడు. శ్రేయస్‌ గోపాల్ బౌలింగ్‌లో ఫోర్‌ బాది మూడంకెల స్కోరు సాధించాడు. ఐపీఎల్‌లో అతనికిదే తొలి శతకం కావడం విశేషం. సెంచరీ చేయడంతో మయాంక్ ఓ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 37 బంతుల్లో యూసుఫ్ పఠాన్ సెంచరీ చేయగా.. మయాంక్ 45 బంతుల్లో చేశాడు. మురళీ విజయ్ (46), విరాట్ కోహ్లీ (47), వీరేందర్ సెహ్వాగ్ (48) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అత్యధిక పరుగులు చేసిన మూడో ఓపెనింగ్ జోడి:

అత్యధిక పరుగులు చేసిన మూడో ఓపెనింగ్ జోడి:

కింగ్స్‌ పంజాబ్‌ పవర్‌ప్లేలో రికార్డు నమోదు చేసింది. ఈ ఐపీఎల్‌లో అత్యధిక పవర్‌ప్లే పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. పవర్‌ప్లేలో కింగ్స్‌ పంజాబ్‌ 60 పరుగులు చేసింది. దాంతో ముంబై ఇండియన్స్‌ నమోదు చేసిన 59 పరుగుల పవర్‌ ప్లే రికార్డును కింగ్స్‌ పంజాబ్‌ అధిగమించింది. అంతేకాదు ఈ సీజన్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని మయాంక్, రాహుల్ జోడీ నమోదు చేసింది. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఓపెనింగ్ జోడిగా (183) కూడా రాహుల్, మయాంక్ నిలిచారు.

Story first published: Sunday, September 27, 2020, 21:10 [IST]
Other articles published on Sep 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+