KKR vs RR: క్యాచ్‌ను వ‌దిలేసి.. బంతికి ఉమ్మి రాస్తూ దొరికిపోయిన ఊత‌ప్ప!!

IPL 2020,RR vs KKR : Robin Uthappa Spotted, Trolls || Oneindia Telugu

దుబాయ్‌: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్ ‌(ఐసీసీ) క్రికెట్ ఆటలో తాత్కాలిక నిబంధనలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా వైరస్‌ ముప్పుతో బంతిపై మెరుపు కోసం ఉమ్మిని రద్దకూడదని ఐసీసీ నిషేధం విధించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే.. శిక్షలు ఏంటో కూడా చెప్పింది. అలవాటులో పొరపాటో లేదా ఉద్దేశపూర్వకంగా చేశాడో తెలియదు గానీ బంతికి ఉమ్మిని రాస్తూ కెమెరాకు చిక్కాడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ప్లేయ‌ర్ రాబిన్‌ ఉతప్ప.

 ఉమ్మి రాస్తూ దొరికిపోయిన ఊత‌ప్ప:

ఉమ్మి రాస్తూ దొరికిపోయిన ఊత‌ప్ప:

దుబాయ్‌ వేదికగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయ‌ల్స్‌, కోల్‌కతా నైట్ రైడ‌ర్స్‌ జట్లు తలపడ్డాయి. కోల్‌కతా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో రాజస్థాన్‌ ఫీల్డర్‌ రాబిన్‌ ఉతప్ప బంతికి ఉమ్మిని రుద్దాడు. మూడో ఓవర్‌ ఐదో బంతికి ఓపెనర్ సునీల్ నరైన్‌ క్యాచ్‌ను ఉతప్ప నేలపాలు చేశాడు. ఆ తర్వాత బంతికి లాలాజలం రుద్దుతూ కెమెరాకు చిక్కాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అభిమానులు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ఇదేం పనప్పా.. ఉతప్ప అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఒకసారి మాత్రమే చేయడంతో:

ఒకసారి మాత్రమే చేయడంతో:

ఒక ఇన్నింగ్స్‌లో తాజా రూల్స్ ప్ర‌కారం రెండు సార్లు మాత్ర‌మే ఇలాంటి పొర‌పాట్ల‌కు అవ‌కాశం ఉంటుంది. బంతికి ఫీల్డర్‌ ఉమ్మి రుద్దితే.. అంపైర్లు కలగజేసుకొంటారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బంతిని శుభ్రం చేయిస్తారు. మొదటి సారి ఫీల్డర్‌కు నిబంధనలను వివరిస్తారు. వరుసగా రెండుసార్లు చేస్తే హెచ్చరిస్తారు. ఆ తర్వాత కూడా అలాగే చేస్తే శిక్షగా ప్రత్యర్థికి ఐదు పరుగులు అదనంగా ఇస్తారు. అయితే రాబిన్‌ ఉతప్ప ఒకసారి మాత్రమే కెమెరాకు చిక్కడంతో బతికిపోయాడు.

 చెత్త రికార్డు బ్రేక్:

చెత్త రికార్డు బ్రేక్:

ఈ మ్యాచ్ ద్వారా రాబిన్‌ ఉతప్ప ఓ చెత్త రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకూ ఐపీఎల్‌లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడిన 90 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఓడింది. బుధవారం కోల్‌కతా చేతిలో రాజస్థాన్ ఓడటంతో.. ఉతప్ప ప్రాతినిధ్యం వహించిన జట్టు 91సార్లు ఓటమిని చవి చూసింది. ఈ జాబితాలో కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ మూడో స్థానంలో నిలిచారు. కార్తీక్ ఆడిన జట్లు 87 మ్యాచ్‌ల్లో ఓటమి చవి చూడగా.. రోహిత్ శర్మ ఖాతాలో 85 ఓటములు ఉన్నాయి.

బ్యాటింగ్‌లో విఫలం:

బ్యాటింగ్‌లో విఫలం:

టాస్‌ గెలిచిన రాజస్థాన్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. శుభ్‌మన్‌ గిల్‌ (47), నితీశ్‌ రాణా (22), ఆండ్రీ రసెల్‌ (24), ఇయాన్ మోర్గాన్‌ (34*) రాణించడంతో 6 వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ తేలిపోయింది. 42 పరుగులకే 5 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. స్టీవ్ స్మిత్‌, సంజు శాంసన్, రాహుల్ తెవాతియా, రాబిన్ ఉతప్ప, రియాన్‌ పరాగ్ విఫలమయ్యారు. టామ్‌ కరన్‌ (54*) అర్ధశతకం బాదాడు. దీంతో రాజస్థాన్‌ 137/9కే పరిమితమైంది.

KKR vs RR: ఎవరూ ఏమీ ఆశించని ఏకైక కెప్టెన్.. దినేష్ కార్తీన్‌ను ఉతికారేస్తున్న నెటిజన్లు!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, October 1, 2020, 14:08 [IST]
Other articles published on Oct 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X