For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs RR: ఎవరూ ఏమీ ఆశించని ఏకైక కెప్టెన్.. దినేష్ కార్తీన్‌ను ఉతికారేస్తున్న నెటిజన్లు!!

RR vs KKR: Failures for KKR skipper Dinesh Karthik continue, fans questioned his captaincy
IPL 2020,RR vs KKR : Dinesh Karthik's Captaincy Questioned By Fans, Posting Funny Memes || Oneindia

దుబాయ్: ఐపీఎల్‌ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్ దినేష్ కార్తీక్ మరోసారి విఫలమయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి.. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో కార్తీక్‌ డకౌట్‌ అయ్యాడు. మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్ రెండు కీలక ఇన్నింగ్స్‌లు (42, 34) ఆడాడు. దీంతో కార్తీక్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.

 ఏమీ ఆశించని ఏకైక కెప్టెన్:

ఏమీ ఆశించని ఏకైక కెప్టెన్:

కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా దినేష్ కార్తీక్ ఆకట్టుకోవడంతో ఫాన్స్ కామెంట్లు, ఫన్నీగా మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. 'ఎవరైనా కెప్టెన్‌గా అయినప్పుడు మైదానంలో వారి చురుకుదనాన్ని చూడాలని అందరూ ఆశిస్తారు. ఎవరూ ఏమీ ఆశించని ఏకైక కెప్టెన్ దినేష్ కార్తీక్ మాత్రమే' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 'జట్టులో ఇయాన్‌ మోర్గాన్ ఉండగా.. కెప్టెన్‌గా దినేష్ కార్తీక్‌ను ఎందుకు ఎంచుకున్నారు' అని మరొకరు ట్వీట్ చేశారు. కోల్‌కతా కెప్టెన్ దినేష్ కార్తీక్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి అని ఫాన్స్ మండిపడుతున్నారు.

ఇప్పటికైనా ఫామ్ అందుకుంటాడో?:

ఇప్పటికైనా ఫామ్ అందుకుంటాడో?:

సన్‌రైజర్స్ మ్యాచ్ తర్వాత దినేష్ కార్తీక్ మాట్లాడుతూ... 'సన్‌రైజర్స్ మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యా. కేవలం ఒక్క డకౌట్‌ ఏ ఆటగాడికి చెడ్డ పేరు తీసుకురాలేదు. నా అంశంలోనూ ఇది వర్తిస్తుంది. ఒక్కో రోజు పరుగులు చేయలేకపోవచ్చు. ఈ రోజు అదే జరిగింది. తర్వాతి మ్యాచ్‌లో పరుగులు చేస్తా' అని దినేష్ కార్తీక్‌ ధీమా వ్యక్తం చేశాడు. కానీ ఒక పరుగుకే పెవిలియన్ చేరాడు. ఇప్పటికైనా కార్తీక్ గాడిలో పెడతాడేమో చూడాలి.

ఉతప్పను కూడా:

ఉతప్పను కూడా:

మరోవైపు రాబిన్ ఉతప్పను కూడా నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫీల్డర్ ఉతప్ప ఆరంభంలోనే సులువైన క్యాచ్‌ని నేలపాలు చేశాడు. మూడో ఓవర్ వేసిన జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌లో ఐదో బంతిని మిడాన్ దిశగా సునీల్ నరైన్ షాట్ ఆడాడు. కానీ బంతి బ్యాటుకు సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో.. అది నేరుగా ఫీల్డర్ ఉతప్ప చేతుల్లోకి వెళ్లింది. అయితే తడబడి ఆ క్యాచ్‌ని అతడు నేలపాలు చేశాడు. దాంతో ఉతప్పని నెటిజన్లు ఉతికారేస్తున్నారు. సులువైన క్యాచ్ కూడా పట్టలేదంటూ ఫైర్ అవుతున్నారు.

 37 పరుగుల తేడాతో ఘన విజయం:

37 పరుగుల తేడాతో ఘన విజయం:

ఈ మ్యాచులో ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో కోల్‌కతా అదరగొట్టింది. 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి లీగ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. రెండు మ్యాచ్‌ల్లో విధ్వంసకర బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్ ఆటగాళ్లు..‌ ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్ల ముందు తడబడ్డారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 174 పరుగులు చేసింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (47, 34 బంతుల్లో; 5×4, 1×6), ఇయాన్ మోర్గాన్‌ (34*, 23 బంతుల్లో; 1×4, 2×6) మెరిశారు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ రెండు వికెట్లతో రాణించాడు. అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్.. కోల్‌కతా బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది. టామ్‌ కరన్‌ (54, 36 బంతుల్లో; 2×4, 3×6) అర్ధ శతకం బాదాడు.

RR vs KKR: రాయల్స్‌ జోరుకు అడ్డుకట్ట.. కోల్‌కతా ఘన విజయం!!

Story first published: Thursday, October 1, 2020, 13:23 [IST]
Other articles published on Oct 1, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+