RR vs KKR: బంతి వికెట్లను తాకిన బెయిల్ పడలేదు (వీడియో)


హైదరాబాద్: జైపూర్ వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఓపెనర్ క్రిస్ లిన్ విషయంలో రాజస్థాన్ రాయల్స్‌కు ఎంతమాత్రం కలిసిరాలేదు. హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన క్రిస్ లిన్ ఆరంభంలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అసలేం జరిగింది?
140 పరుగుల లక్ష్య చేధనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్ వేసేందుకు ధావల్ కులకర్ణి బౌలింగ్‌కు వచ్చాడు. ధావల్ కులకర్ణి వేసిన రెండో బంతి బ్యాట్‌కు ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకొని స్టంప్స్‌ను తాకింది. బంతి స్టంప్స్‌ను తాకినా బెయిల్స్ కిందపడలేదు. బంతి వికెట్లను తాకినప్పటికీ బెయిల్స్ కింద పడలేదు.
నాటౌట్‌గా ప్రకటించిన అంఫైర్
దీంతో అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో ధావల్ కులకర్ణి నిరాశ చెందాడు. తనకు వచ్చిన లైఫ్‌తో ఆ తర్వాత క్రిస్ లిన్ పరుగుల వరద పారించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోని వీక్షించిన అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

8 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 139 పరుగులు చేసింది. రాజస్థాన్ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు క్రిస్ లిన్, నరైన్ దూకుడుగా ఆడటంతో కేవలం 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో రాజస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications