RR vs GT Toss Update: టాస్ గెలిచిన రాజస్థాన్.. కీలక మార్పులతో బరిలో రెండు జట్లు

గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రామల్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా.. గుజరాత్ టైటాన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ మొదటి స్థానంలో ఉండగా.. గుజరాత్ టైటాన్స్ ఐదో స్థానంలో ఉంది. ఇరు జట్లు కూడా ఇప్పటివరకు నాలుగేసి మ్యాచ్‌ల చొప్పున ఆడి చెరో మూడు విజయాలు సాధించాయి.

సంజూ శాంసన్ ఏమన్నాడంటే..
తాము మొదటగా బౌలింగ్ చేయలానుకుంటున్నామని టాస్ గెలిచిన అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చెప్పాడు. మ్యాచ్‌పై మంచు ప్రభావం ఉందని, అయితే తాము పరిస్థితులను ఉపయోగించుకుంటామని తెలిపాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ ఆడడం లేదని, అతని స్థానంలో జిమ్మీ నీషమ్ బరిలోకి దిగుతున్నట్లు శాంసన్ చెప్పాడు.

హార్దిక్ పాండ్యా ఏమన్నాడంటే..
టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేసేవారిమని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. ప్రస్తుతం టాస్ గురించి పెదగా పట్టించుకోవడం లేదని తెలిపాడు. అలాగే తాను కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నట్లుచెప్పాడు. టీం అంతా రాణిస్తుందని, తర్వాతి మ్యాచ్‌ల్లోని ఇదే కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక తాను బ్యాట్‌తో తప్పితే బాల్‌తో సహకరించగలనని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక తమ బౌలింగ్ విభాగంగా అద్భుంతంగా రాణిస్తుందని కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో తాము రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నామని, దర్శన్ నల్కండే స్థానంలో యష్ దయాల్, సాయి సుదర్శన్ స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చినట్టు చెప్పాడు.

తుది జట్లు
గుజరాత్ టైటాన్స్: మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), శుభమన్ గిల్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ, యశ్ దయాల్
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్(వికెట్ కీపర్/ కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, షిమ్రాన్ హెట్మెయర్, జేమ్స్ నీషమ్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications