Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వీల్ చెయిర్‌లో నుంచి లేచి మరీ.. ఉప్పొంగిపోయిన ద్రవిడ్ (వీడియో వైరల్)

Vaibhav Suryavanshi Rahul Dravid: అంకితభావానికి, నిబద్ధతకు మారు పేరు రాహుల్‌ ద్రవిడ్‌! ఆటగాడిగా ఇప్పటికే దీన్ని ఎన్నోసార్లు నిరూపించిన అతడు.. ప్రస్తుతం కోచ్‌గానూ అదే చేస్తున్నాడు. కాలు బాగోకపోయినా కూడా చేతి కర్రల సాయంతో నడుస్తూ.. వీల్ చెయిర్ సాయంతో మైదానంలో తిరుగుతూ తన ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం కోసం బాగా శ్రమిస్తున్నాడు. తన ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తూ వారిని ఎంతగానో ప్రోత్సాహిస్తున్నాడు. అయితే తాజాగా అతడి నమ్మకాన్ని నిలబెట్టాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. తన (101: 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లు) సంచలన ఇన్నింగ్స్ తో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

ఊచకోతే...
ఈ మ్యాచులో బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు వైభవ్ సూర్యవంశీ. అతడు వరుసగా ఒక్కోక్క సిక్స్ బాదుతుంటే స్టాండ్స్ లో ఉన్న ప్రేక్షకులు లేచి నిలబడి కేరింతలు, చప్పట్లు, ఈలులు, గోలలతో స్టేడియం మోత మోగించారు. ఈ క్రమంలోనే వైభవ్ ఎలాంటి వణకు బెణుకు లేకుండా 17 బంతుల్లోనే తన తొలి అర్ధశతకం చేశాడు. ఆ తర్వాత 35 బంతుల్లోనే తన ఐపీఎల్ మొదటి, ఫాస్టెస్ట్ సెంచరీ బాది పలు రికార్డులు కూడా నమోదు చేశాడు. ఓ దశలో వరుసగా 6,4,6,4,4,6తో ఊచకోత కోసి ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. చివరిగా తన జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. దీంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం పింక్ కలర్ జెండాలతో, వైభవ్ సూర్యవంశీ నామస్మరణతో ఝల్లుమంది. వచ్చిన ప్రేక్షకులు, ఇరు జట్ల ఆటగాళ్లు అంతా లేచి నిలబడి, వైభవ్ సూర్యవంశీకి స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇచ్చారు.

RR VS GT Rahul Dravid got up from his wheelchair and celebrates Vaibhav Suryavanshi s century

కాలు బాగోకపోయినా.. లేచి నిలబడి..
ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ డగౌట్ లో కూడా సంబరాలు కూడా అంబరాన్నంటాయి. వీల్ చెయిర్ లో ఉన్న రాహుల్ ద్రవిడ్ కూడా తన కాలు బాలేకపోయినా.. ఒక్కసారిగా లేచినిలబడి చప్పట్లు కొడుతూ వైభవ్ సూర్యవంశీని అభినందించాడు. లేచి నిలబడే క్రమంలో కుదుటకు గురైన కూడా బ్యాలెన్స్ చేసుకుని నిలబడ్డాడు. తన శిష్యుడు చేసిన ప్రదర్శనకు మెచ్చి, నిలబడే ఆనందంతో ఉప్పొంగిపోతూ... విజయ చిహ్నం చూపిస్తూ ఎంతో గర్వపడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన క్రికెట్ అభిమానులు కూడా.. రాహుల్ ద్రవిడ్ ను లేచి నిలబడేలా చేశావు అంటూ వైభవ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Story first published: Tuesday, April 29, 2025, 6:20 [IST]
Other articles published on Apr 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+