Vaibhav Suryavanshi: చరిత్ర సృష్టించిన వైభవ్ - ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సంచరీ
Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన 14 ఏళ్ల యంగ్ స్టార్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ వైలెన్స్ బ్యాటింగ్ చేశాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచులో అన్ బిలీవబుల్ పెర్ఫామెన్స్ చేశాడు. బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని దద్దరిల్లేలా చేసిన అతడు.. తన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. మొత్తంగా ఈ మ్యాచులో 38 బంతుల్లో 265.79 స్ట్రైక్ రేటుతో 7 ఫోర్లు 11 సిక్సుల సాయంతో 101 పరుగులు చేశాడు.
ఈ మ్యాచులో తన ఫియర్ లెస్ స్ట్రోక్ ప్లే, ఫియర్ లెస్ ఇంటెంట్ తో బ్యాటింగ్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. సిరాజ్,రషీద్ ఖాన్, ఇషాంత్ లాంటి గుజరాత్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. తద్వారా IPL 2025లో కేవలం 35 బంతుల్లోనే శతకం బాది ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఐపీఎల్ లో శతకం బాదిన అతి పిన్న వయస్కుడి (14 ఏళ్ల 322 రోజులు)గా వైభవ్ రికార్డుకెక్కాడు. ఈ సీజన్ లో సెంచరీ బాదిన తొలి ఇండియన్ బ్యాటర్ గానూ నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే కావడం విశేషం.
అలానే 17 బంతుల్లోనే అర్ధ శతకం బాది ఈ సీజన్ లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఇది రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్ లో అర్ధ శతకం బాదిన అతి పిన్న వయస్కుడి (14 ఏళ్ల 322 రోజులు)గా వైభవ్ రికార్డుకెక్కాడు. మొత్తంగా ఈ మ్యాచులో తన ప్రదర్శనతో స్టార్ బౌలర్లను వణికించేసిన వైభవ్.. ప్రసిద్ధ్ వేసిన 12వ ఓవర్ లో ఐదో బంతికి వైభవ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications