Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR VS GT: గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్.. టాప్ లేపేశారు!

RR VS GT: ఐపీఎల్ 2025లో భాగంగా సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా తాజాగా జరుగుతోన్న కీలక మ్యాచులో గుజరాత్ టైటాన్స్ కు అదృష్టం వరించింది. ఆ జట్టు బ్యాటర్లు అద్భుతమైన స్కోరు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ ముందు 210 పరుగులు రికార్డ్ ఛేజ్ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇంతవరకు ఆర్ఆర్ ఇంత లక్ష్యాన్ని ఛేజ్ చేసింది లేదు.

ఆ ముగ్గురు టాప్ లేపేశారు..
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జట్టులో టాప్ ఆర్డర్ అద్భుతంగా ఆడింది. సాయి సుదర్శన్ బ్రిలియంట్ నాక్ ఆడాడు. 30 బంతుల్లో 130 స్ట్రైక్ రేటుతో 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 39 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ 50 బంతుల్లో 168 స్ట్రైక్ రేటుతో 5 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 84 రన్స్ చేశాడు. వీరిద్దరు తొలి వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జోస్ బట్లర్ 26 బంతుల్లో 192 స్ట్రైక్ రేటుతో 3 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 50 పరుగులు అర్ధ శతకం బాదాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (13), రాహుల్ తెవాతియా (9) విఫలమయ్యారు. ఆఖర్లో షారుక్ ఖాన్ (5 నాటౌట్) పరుగులు చేశాడు.

క్యాచ్ డ్రాప్ లు.. ఎక్కువ పరుగులు..
రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు ఫీల్డింగ్ లో చాలా క్యాచులు మిస్ చేయడం పెద్ద బ్యాక్ డ్రాప్. బౌలర్లు ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు. జోఫ్రా ఆర్చర్ ఒక్క వికెట్ తీసి ఏకంగా 49 పరుగులు సమర్పించుకున్నాడు. మహీశ్ తీక్షణ 2/35 వికెట్లు, సందీప్ శర్మ 1/33 వికెట్ దక్కించుకున్నారు.

RR VS GT IPL 2025 shubman gill jos buttler half centuries sets rajasthan royals target 210 runs
Story first published: Monday, April 28, 2025, 21:30 [IST]
Other articles published on Apr 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+