Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs GT: రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్.. అఫ్ఘాన్ ఆల్ రౌండర్ అరంగేట్రం

RR vs GT: ఐపీఎల్ 2025లో భాగంగా సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా తాజాగా జరుగుతోన్న కీలక మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచులో భాగంగా ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కు దిగింది. అయితే ఈ పోరులో రాజస్థాన్ రాయల్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గుజరాత్ టైటాన్స్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఈ మ్యాచుతో అఫ్ఘాన్ క్రికెటర్, బౌలింగ్ ఆల్ రౌండర్ కరీమ్ జనత్ అరంగేట్రం చేశాడు.

రాజస్థాన్ రెండు మార్పులివే..
"మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. LSGతో ఆడినప్పుడు ఉన్న పిచ్‌లానే ఉంది. పిచ్ బానే ఉంది. కాస్త తక్కువ బౌన్స్ ఉండొచ్చు. నిన్న రాత్రి కొంచెం డ్యూ వచ్చింది. అందుకే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాం. మా జట్టులో ప్రతి ఒక్కరూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నవాళ్లే. ఆ స్థితిని ఎలా అధిగమించాలో వారికి తెలుసు. మేం అందరూ నిజయాతీగా, ఓపెన్ గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు కలిసికట్టుగా ఆట ఆడితే సరిపోతుంది. మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం. గత మూడు మ్యాచ్‌లలో మేము 35 ఓవర్ల వరకు మంచి క్రికెట్ ఆడాము. కానీ ఇదే IPLలో ముఖ్యమైన దశ. ఒక్కసారి తడబడితే చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. ఫరూకీ, తుషాక్ ను పక్కకు పెట్టాం. తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్ జట్టులోకి వచ్చారు." అని రియాన్ పరాగ్ చెప్పాడు.

రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు ఇదే
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీశ్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మయర్, వానిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, యుధ్వీర్ సింగ్ చరక్

గుజరాత్ టైటాన్స్ తుది జట్టు ఇదే
సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్కేపర్), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాతియా, కరీమ్ జనత్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

RR vs GT IPL 2025 afghan cricketer Karim Janat ipl debut against Rajasthan Royals
Story first published: Monday, April 28, 2025, 19:29 [IST]
Other articles published on Apr 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+