Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs GT: హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ షో.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై గుజ‌రాత్ టైటాన్స్‌ ఘ‌న విజ‌యం

RR vs GT: Hardik pandya(87) Half-century and taken 1 wicket.. Gujarat titans beat Rajasthan royals

కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ షోతో రాజస్థాన్ రాయ‌ల్స్‌పై గుజ‌రాత్ టైటాన్స్ ఘ‌న‌విజ‌యం సాధించింది. మొద‌ట బ్యాటింగ్‌లో హార్దిక్ పాండ్యా (87*) చెల‌రేగ‌డంతో 192 ప‌రుగుల భారీ స్కోర్ చేసిన గుజ‌రాత్‌.. అనంత‌రం బౌల‌ర్లు స‌త్తా చాట‌డంతో రాజ‌స్థాన్‌ను 155 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది. దీంతో రాజ‌స్థాన్‌పై గుజ‌రాత్ 37 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. రాజ‌స్థాన్ ఓపెన‌ర్ బ‌ట్ల‌ర్‌ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగినా మిగ‌తా వారంతా విఫ‌ల‌మ‌వ‌డంతో ల‌క్ష్యాన్ని చేధించలేక‌పోయింది. గుజ‌రాత్ బౌల‌ర్ల ధాటికి రాజ‌స్థాన్ ఏ ద‌శ‌లోనూ ల‌క్ష్యాన్ని చేధించేలా క‌నిపించ‌లేదు. బౌలింగ్‌లోను హార్దిక్ పాండ్యా ఓ వికెట్ తీసి స‌త్తా చాటాడు. ఇక ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో గుజ‌రాత్ టైటాన్స్ మొద‌టి స్థానానికి దూసుకెళ్లింది.

 ప‌వ‌ర్‌ప్లేలోనే 3 వికెట్లు

ప‌వ‌ర్‌ప్లేలోనే 3 వికెట్లు

193 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌తో బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ఆరంభంలోనే గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ప‌వ‌ర్‌ప్లేలోనే ఆ జ‌ట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఓపెన‌ర్ ప‌డిక్క‌ల్ డ‌కౌట్ కాగా, ఆశ్చ‌ర్యక‌రంగా వ‌న్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన అశ్విన్ ఓ సిక్స‌ర్ సాయంతో 8 బంతుల్లో 8 ర‌న్స్ చేశాడు. ఫెర్గ్యూస‌న్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న మిల్ల‌ర్‌కు దొరికిపోయాడు.

బ‌ట్ల‌ర్ వీర‌బాదుడు

బ‌ట్ల‌ర్ వీర‌బాదుడు

ఓ వైపు వికెట్లు ప‌డిన‌ప్ప‌టికీ బ‌ట్ల‌ర్ మాత్రం అవేవి ప‌ట్టించుకోకుండా ప‌వ‌ర్‌ప్లేలో చెల‌రేగిపోయాడు. తొలి ఓవ‌ర్లోనే 3 ఫోర్లు బాదిన బ‌ట్ల‌ర్ మిగతా ఓవ‌ర్ల‌లో కూడా అదే దూకుడును ప్ర‌ద‌ర్శించి 8 ఫోర్లు, 3 సిక్సుల‌తో 23 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ చేశాడు. త‌ద్వారా ఈ సీజ‌న్‌లో ప‌వ‌ర్ ప్లేలోనే హాఫ్ సెంచ‌రీ చేసిన తొలి ఆట‌గాడిగా బ‌ట్ల‌ర్ రికార్డు సృష్టించాడు. అలాగే బ‌ట్ల‌ర్ చేసిన ఈ హాఫ్ సెంచ‌రీ ఈ సీజ‌న్లో మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ. హాఫ్ సెంచ‌రీ చేసిన త‌ర్వాత బంతికే ఫెర్గ్యూస‌న్ బౌలింగ్‌లో బ‌ట్ల‌ర్ బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా 24 బంతుల్లో 54 ప‌రుగులు చేశాడు. బ‌ట్ల‌ర్ దూకుడుతో ప‌వ‌ర్‌ప్లే 3 వికెట్లు కోల్పోయిన‌ప్ప‌టికీ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 65 ప‌రుగులు చేసింది.

కొంప‌ముంచిన శాంస‌న్ ర‌నౌట్

కొంప‌ముంచిన శాంస‌న్ ర‌నౌట్

జ‌ట్టు స్కోర్ 74 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా కెప్టెన్ సంజూ శాంస‌న్ (11) ర‌నౌట్ కావ‌డం ఆ జ‌ట్టు కొంప‌ముంచింది. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కొట్టిన త్రో నేరుగా వికెట్ల‌కు త‌గ‌ల‌డంతో శాంస‌న్ ర‌నౌట్ అయ్యాడు. 11వ ఓవ‌ర్లో య‌ష్ ద‌యాల్ బౌలింగ్‌లో డ‌సెన్ (6) ఔట‌వ‌డంతో 90 ప‌రుగుల‌కే రాజస్థాన్ 5 వికెట్లు కోల్పోయింది. 13వ ఓవ‌ర్లో ష‌మీ ఓవ‌ర్లో హెట్‌మేయ‌ర్ (29), 17వ ఓవ‌ర్లో ఫెర్గ్యూస‌న్ బౌలింగ్‌లో రియాన్ ప‌రాగ్ (18) ఔట‌వ‌డంతో ఆ జ‌ట్టు 138 ప‌రుగులకు 7 వికెట్లు కోల్పోయి ఓట‌మికి చేరువైంది. చివ‌ర్లో నీషమ్ (17), ప్ర‌సిద్ద్ కృష్ణ (4*), చాహ‌ల్ (5) కూడా త‌క్కువ స్కోర్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 9 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో గుజ‌రాత్ టైటాన్స్ 37 ర‌న్స్ తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ఫెర్గ్యుస‌న్, య‌ష్ ద‌యాల్ మూడేసి వికెట్లు, హార్దిక్ పాండ్యా, మ‌హ్మ‌ద్ ష‌మీ త‌లో వికెట్ తీశారు.

దుమ్ములేపిన హార్దిక్ పాండ్యా

దుమ్ములేపిన హార్దిక్ పాండ్యా

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్ టైటాన్స్ ఆ జ‌ట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా 87 ప‌రుగుల భారీ ఇన్నింగ్స్‌తో చెల‌రేగ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. 15 ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయినప్ప‌టికీ కీల‌క భాగ‌స్వామ్యాల‌తో హార్దిక్ పాండ్యా జ‌ట్టుకు భారీ స్కోర్ అందించాడు. అభిన‌వ్ మ‌నోహ‌ర్‌తో క‌లిసి 86 ప‌రుగుల భాగ‌స్వామ్యం, డేవిడ్ మిల్ల‌ర్‌తో క‌లిసి 53 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. మొత్తంగా హార్దిక్ పాండ్యా 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సుల‌తో 87 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిల్ల‌ర్ 31 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. మ‌నోహ‌ర్ 43 ర‌న్స్‌, గిల్ 13, వేడ్ 12, విజ‌య్ శంక‌ర్ 2 ప‌రుగులు చేశారు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బౌల‌ర్ల‌లో కుల్దీప్ సేన్, చాహ‌ల్, రియ‌న్ ప‌రాగ్ త‌లో వికెట్ తీశారు.

స్కోర్లు

గుజ‌రాత్ టైటాన్స్‌: 192-4

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌: 155-9

Story first published: Thursday, April 14, 2022, 23:56 [IST]
Other articles published on Apr 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+