Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs GT: విజ‌య్ శంక‌ర్ నీకో దండం.. ర‌న్స్ చేయ‌వు.. వికెట్లు తీయ‌వు.. మ‌ళ్లీ ఆల్‌రౌండ‌ర్ అంట‌వు

RR vs GT: Gujarat Titans Player Vijay shankar Continuous Failure in IPL 2022

గుజ‌రాత్ టైటాన్స్ ఆట‌గాడు విజ‌య్ శంక‌ర్ మ‌రోసారి దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. ప‌రుగులు చేయ‌లేక నిర్ల‌క్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేవ‌లం 2 ప‌రుగులే చేసి కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో నిర్ల‌క్ష్యంగా ఆడి వికెట్ కీప‌ర్ సంజూ శాంస‌న్‌కు దొరికిపోయాడు. త‌న ఫేల‌వ ఆట తీరుతో విజ‌య్ శంక‌ర్ టీంకు భారంగా మారాడు. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ‌య్ శంక‌ర్‌పై నెజిజ‌న్లు మండిప‌డుతున్నారు. అలాగే విజ‌య్ శంక‌ర్‌ను మెగా వేలంలో తిరిగి కొనుగోలు చేయ‌కుండా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మంచి ప‌ని చేసిందంటున్నారు.

గ‌త సీజ‌న్లో విజ‌య్ శంక‌ర్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. అయితే పెద‌గా రాణించ‌క‌పోవ‌డంతో అత‌డిని స‌న్‌రైజ‌ర్స్ వేలంలోకి వ‌దిలేసింది. దీంతో వేలంలో కోటి 40 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు గుజ‌రాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. అలాగే తుది జ‌ట్టులో ఆల్‌రౌండ‌ర్ కోటాలో కీల‌క స్థానం క‌ల్పించింది. ప్ర‌తి మ్యాచ్‌లో కీల‌క‌మైన మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపుతుంది. కానీ విజ‌య్ శంక‌ర్ మాత్రం అవ‌కాశాల‌ను వినియోగించులేక‌పోతున్నాడు. అట్ల‌ర్ ఫాప్ ఆట తీరుతో తీవ్రంగా నిరాశ‌ప‌రుస్తున్నాడు. మొద‌టి రెండు మ్యాచ్‌ల్లో 4, 13 ప‌రుగులే చేశాడు. ఆ త‌ర్వాతి రెండు మ్యాచ్‌ల్లో తుది జ‌ట్టులో ఆడ‌లేదు. ఇక తాజాగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్‌లో బ‌రిలోకి దిగాడు. ఈ సారి కూడా 2 ప‌రుగుల‌కే ఔటై తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క వికెట్ కూడా తీయ‌లేదు. ఇంకేముందు విజ‌య్ శంక‌ర్‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. దీంతో విజయ్ శంక‌ర్ ప‌రుగులు చేయ‌వు, వికెట్లు తీయ‌వు, మ‌ళ్లీ ఆల్‌రౌండ‌ర్ అంటావ‌ని నెజిజ‌న్లు రాసుకొస్తున్నారు.

తుది జ‌ట్లు
గుజరాత్ టైటాన్స్: మాథ్యూ వేడ్(వికెట్ కీప‌ర్), శుభమన్ గిల్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ, యశ్ దయాల్

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్(వికెట్ కీప‌ర్/ కెప్టెన్‌), రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, షిమ్రాన్ హెట్మెయర్, జేమ్స్ నీషమ్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్

Story first published: Thursday, April 14, 2022, 22:51 [IST]
Other articles published on Apr 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+