Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs GT: వైభవ్ సూర్యవంశీ ఔట్!

RR vs GT: ఐపీఎల్ 2025లో భాగంగా ఏప్రిల్ 28న జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. రాజస్థాన్ రాయల్స్ గురించి చెప్పాలంటే.. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఆ జట్టు పరిస్థితి దారుణంగా ఉంది. రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్‌లు ఆడి 2 గెలిచింది. గుజరాత్ టైటాన్స్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ తన ప్రతిష్టను కాపాడుకోవడానికి ఏప్రిల్ 28న గుజరాత్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టులోని ప్లేయింగ్ ఎలెవన్‌లో కొన్ని మార్పులు ఉండవచ్చు.

వైభవ్ సూర్యవంశీ ఎలిమినేట్ అవుతాడా?
ఓపెనింగ్ బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీని తొలగించే అవకాశం ఉంది. సంజు శాంసన్ లేకపోవడంతో వైభవ్ సూర్యవంశీకి రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది. ఇప్పుడు సంజు శాంసన్ తిరిగి సొంత మైదానంలో జట్టులోకి తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశం ఉంతది. గత మ్యాచ్‌లో వైభవ్ బ్యాట్ నుంచి కేవలం 16 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ విషయంలో కూడా అతడిని పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. సంజూ శాంసన్, యశస్వీ జైస్వాల్ ఓపెనర్లుగా రానున్నారు.

RR vs GT Can Vaibhav Suryavanshi Be Dropped Rajasthan Royals vs Gujarat Titans IPL 2025 Preview

మిడిల్ ఆర్డర్ ఇలా..
నితీష్ రాణా మూడో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. గత మ్యాచ్ లో నితీష్ రాణా 28 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. గత మ్యాచ్ లో ఆర్సీబీపై రియాన్ పరాగ్ 22 పరగులు చేశాడు. లోయర్ మిడిల్ ఆర్డర్ లో ధ్రువ్ జురేల్, షిమ్రాన్ హెట్మెయర్, శుభం దూబే బాధ్యతలు స్వీకరించవచ్చు. ఈ ఆటగాళ్లు రాజస్థాన్ తరఫున లోయర్ మిడిల్ ఆర్డర్ లో రాణిస్తున్నారు.

బౌలింగ్ విభాగం ఇలా..
స్పిన్ బౌలింగ్ బాధ్యత ప్రధానంగా వనిందు హసరంగా భుజాలపై ఉండవచ్చు. రియాన్ పరాగ్ స్పిన్ బౌలింగ్ విభాగంలో కూడా భాగం కావచ్చు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్, ఫజల్ హక్ ఫారూఖీ, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ బాధ్యతలను చేపట్టగలరు.

స్పిన్ బౌలింగ్ విభాగం బాధ్యత ప్రధానంగా వనిందు హసరంగా భుజాలపై ఉండవచ్చు. దీనితో పాటు, రియాన్ పరాగ్ స్పిన్ బౌలింగ్ విభాగంలో కూడా ఒక ముఖ్యమైన భాగం కావచ్చు. ఫాస్ట్ బౌలర్లుగా, జోఫ్రా ఆర్చర్, ఫజల్హాక్ ఫరూఖీ, తుషార్ దేశ్‌పాండే మరియు సందీప్ శర్మ బాధ్యతలను చేపట్టగలరు.

గుజరాత్ టైటాన్స్ తో తలపడే రాజస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..(అంచనా)
యశస్వి జైస్వాల్, సంజు సంసోమ్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, ఫజల్‌హాక్ ఫరూకీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే (శుభమ్ దూబే ఇంపాక్ట్).

Story first published: Sunday, April 27, 2025, 17:51 [IST]
Other articles published on Apr 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+