RR vs GT: కొంపముంచిన ఆ తప్పిదాలు.. రాజస్థాన్ రాయల్స్ ఓటమికి 4 ప్రధాన కారణాలు ఇవే!

ఐపీఎల్ 2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది. రాజస్థాన్‌పై గుజరాత్ 37 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య చేధనలో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేసింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ఓటమికి గల ప్రధాన కారణాలు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా 4 కారణాలు ఆ జట్టు ఓటమికి ప్రధానంగా కారణమయ్యాయి.
మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోయడం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌ను ఆరంభలోనే 2 వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్ దెబ్బకొట్టింది. ఆ కాసేపటికే మరో వికెట్ తీయడంతో గుజరాత్ 53 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ కొంపముంచింది. దీంతో హార్దిక్ పాండ్యా, అభినవ్ మనోహర్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక డెత్ ఓవర్లలోనూ రాజస్థాన్ బౌలర్లు అనుకున్నంతగా రాణించలేకపోయారు. దీంతో హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ చివరి 4 ఓవర్లలోనే 50 పరుగులు పిండుకున్నారు. దీంతో గుజరాత్ టైటాన్స్ 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇది రాజస్థాన్ రాయల్స్ ఓటమికి మొదటి కారణంగా చెప్పుకోవచ్చు.
పవర్‌ప్లేలో 3 వికెట్లు కోల్పోవడం
193 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఓపెనర్ జోస్ బట్లర్ దూకుడుతో పవర్‌ప్లేలోనే రాజస్థాన్ రాయల్స్ 65 పరుగులు బాదేసింది. కానీ దురదృష్టవశాత్తూ పవర్‌ప్లేలోనే ఏకంగా 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ డకౌట్ కాగా, వన్‌డౌన్‌లో వచ్చిన అశ్విన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 8 పరుగులకే ఔటయ్యాడు. పవర్‌ప్లేలో హాఫ్ సెంచరీ చేసిన బట్లర్ కూడా ఆరో ఓవర్లో ఔటయ్యాడు. దీంతో ఆ జట్టు పవర్‌ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా అశ్విన్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపి చేసిన ప్రయోగం కూడా పెదగా కలిసి రాలేదని చెప్పుకోవాలి. ఇలా పవర్‌ప్లే వైఫల్యం ఆ జట్టు ఓటమికి రెండో కారణంగా నిలిచింది.
శాంసన్ రనౌట్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కీలక సమయంలో రనౌట్ కావడం ఆ జట్టు ఓటమికి మూడో ప్రధాన కారణంగా పరిగణించవచ్చు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పరుగుకు ప్రయత్నించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుత నైపుణ్యంతో కొట్టిన త్రో నేరుగా వికెట్లకు తగిలింది. దీంతో శాంసన్ రనౌట్ రూపంలో వెనుదిరగాల్సి వచ్చింది.
మిడిలార్డర్ వైఫల్యం
మిడిలార్డర్ విఫలమవడం రాజస్థాన్ రాయల్స్ ఓటమికి నాల్గో కారణంగా చెప్పవచ్చు. ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్లు శాంసన్ (11), డస్సెన్ (6), హెట్‌మేమర్ (29), రియాన్ పరాగ్ (18), నీషమ్ (17) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఏ దశలోనూ లక్ష్యాన్ని చేధించేలా కనిపించలేదు. మొత్తంగా 155 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఈ 4 తప్పిదాలలో కనీసం రెండు చేయకుండా ఉన్నా ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications